సాహితీ ఇన్‌ఫ్రాటెక్ సంస్థ భారీ మోసానికి పాల్పడింది. ప్రీ లాంచ్ కార్యక్రం ఏర్పాటు చేసి ఫ్లాట్లను విక్రయించింది. వందలాది మంది నుంచి భారీగా డబ్బులు వసూలు చేసింది.  

సాహితీ ఇన్‌ఫ్రాటెక్ సంస్థ భారీ మోసానికి పాల్పడింది. ప్రీ లాంచ్ పేరుతో వందలాది మందికి టోకరా వేసింది. సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్‌లో సాహితీ శర్వాని ఎలైట్ పేరుతో వెంచర్ వేసింది. ప్రీ లాంచ్ కార్యక్రం ఏర్పాటు చేసి ఫ్లాట్లను విక్రయించింది. సంస్థ మాటలను నమ్మిన వందలాది మంది ఈ ఫ్లాట్లను కొనుగోలు చేశారు. దీంతో సంస్థ భారీగా డబ్బులు దండుకుంది అయితే మూడేళ్లు గడిచిన సాహితీ ఇన్‌ఫ్రాటెక్ సంస్థ ఇంతవరకు ఇళ్ల నిర్మాణం చేపట్టలేదు. దీంతో తాము మోసపోయామని తెలుసుకున్న బాధితులు సంస్థ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. 

సాహితీ ఇన్‌ఫ్రాటెక్ సంస్థ.. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు రూ.25 లక్షలు, ట్రిపుల్ బెడ్ రూం ఇళ్లకు రూ.35 లక్షలు చొప్పున వసూలు చేసిందని బాధితులు చెబుతున్నారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.