Asianet News TeluguAsianet News Telugu

రియల్ ఎస్టేట్ పేరుతో మోసాలు.. సాహితీ ఇన్‌ఫ్రా ఎండీ లక్ష్మీనారాయణ అరెస్ట్ , టీటీడీ సభ్యుడి పదవికి రాజీనామా

రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడుల పేరుతో కోట్లలో మోసానికి పాల్పడిన సాహితీ ఇన్‌ఫ్రా ఎండీ లక్ష్మీనారాయణ టీటీడీ పాలకమండలి సభ్యుడి పదవికి రాజీనామా చేశారు. 

sahiti infra md lakshmi narayana resigned as ttd board member
Author
First Published Dec 2, 2022, 9:24 PM IST

సాహితీ ఇన్‌ఫ్రా ఎండీ లక్ష్మీనారాయణను పోలీసులు అరెస్ట్ చేశారు. రియల్ ఎస్టేట్ పేరుతో మోసాలు చేశారని ఆయనపై కేసు నమోదైంది. సీపీఎస్‌లో నమోదైన కేసులో లక్ష్మీనారాయణ అరెస్ట్ చేశారు. సాహితీ ఇన్‌ఫ్రా సంస్థ సకాలంలో ప్రాజెక్ట్‌లను పూర్తి చేయకుండా .. ప్రీలాంచ్ ఆఫర్ల పేరుతో మోసాలకు పాల్పడినట్లుగా ఫిర్యాదుదారులు పేర్కొన్నారు. ప్రాజెక్ట్ మొదలుపెట్టక ముందే కస్టమర్ల నుంచి భారీగా డబ్బులు వసూలు చేసింది. భారీ భవనాల పేరుతో డబ్బుల వసూళ్లకు పాల్పడ్డాడు లక్ష్మీనారాయణ. దాదాపు 4 వేల మంది బాధితుల నుంచి మొత్తం రూ.1439 కోట్ల మోసానికి పాల్పడ్డాడు. పోలీసులు అరెస్ట్ చేయడంతో టీటీడీ సభ్యత్వం కోల్పోనున్నాడు లక్ష్మీనారాయణ. అయితే అంతకుముందే స్వచ్ఛందంగా టీటీడీ పాలకమండలి సభ్యత్వానికి లక్ష్మీనారాయణ రాజీనామా చేశాడు. రాజీనామా లేఖ ఆమోదించాలంటూ ఏపీ ప్రభుత్వానికి పంపాడు. 

ALso REad:రియల్ ఏస్టేట్‌లో మోసాలు:హైద్రాబాద్ లో సాహితీ ఇన్‌ఫ్రా ఎండీ లక్ష్మీనారాయణ అరెస్ట్

Follow Us:
Download App:
  • android
  • ios