రేవంత్ మంత్రాంగం: వెనక్కి తగ్గిన సబిత, సాయంత్రం రాహుల్‌తో భేటీ

కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి పార్టీ మార్పుపై మనసు మార్చుకున్నట్లుగా తెలుస్తోంది. ఆమె కాంగ్రెస్‌ను వీడనున్నారనే వార్తలు రావడంతో టీపీసీసీ పెద్దలు సబితను బుజ్జగించేందుకు ప్రయత్నించారు.

sabitha indra reddy step back to joining in trs

కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి పార్టీ మార్పుపై మనసు మార్చుకున్నట్లుగా తెలుస్తోంది. ఆమె కాంగ్రెస్‌ను వీడనున్నారనే వార్తలు రావడంతో టీపీసీసీ పెద్దలు సబితను బుజ్జగించేందుకు ప్రయత్నించారు.

ఈ క్రమంలో టీకాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి సోమవారం రాత్రి సబితతో భేటీ అయ్యారు. కాంగ్రెస్‌ను వీడవద్దని కలిసికట్టుగా టీఆర్ఎస్‌పై పోరాడదామని ఆయన చెప్పినట్లుగా సమాచారం. రేవంత్ మాటలతో సబిత వెనక్కి తగ్గినట్లుగా తెలుస్తోంది. ఈ రోజు రాహుల్‌ గాంధీ వద్దకు సబిత, రేవంత్ వెళ్లనున్నారు.

2018లో మహేశ్వరం నియోజకవర్గం నుంచి గెలుపొందిన ఆమె ఆ ఎన్నికల్లో తన కుమారుడికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోవడంపై అసంతృప్తిగా ఉన్నారు. దీంతో సబిత పార్టీ మారనున్నారన్న ప్రచారం జరిగింది. శంషాబాద్‌లో జరిగిన రాహుల్ సభకు హాజరైనా ముభావంగానే కనిపించారు.

ఆ తర్వాతి రోజే సబిత.. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, నిజామాబాద్ ఎంపీ కవితతో సమావేశమవ్వడంతో టీకాంగ్రెస్ నేతలు ఉలిక్కిపడ్డారు. సబితకు మంత్రిపదవితో పాటు కుమారుడికి ఎమ్మెల్సీ లేదా మరేదైనా ప్రాధాన్యత కలిగిన పదవిపై టీఆర్ఎస్ నుంచి స్పష్టమైన హామీ లభించినట్లు ప్రచారం జరిగింది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios