Asianet News TeluguAsianet News Telugu

కమిటీ ఏర్పాటు: ఆర్టీసి విలీనం డిమాండ్ పై కేసిఆర్ ప్రశ్నల వర్షం

ఆర్టీసిని ప్రభుత్వంలో విలీనం చేయాలనే డిమాండ్ ను తెలంగాణ సిఎం కేసీఆర్ తోసిపుచ్చారు. కాంగ్రెసు పాలిత రాష్ట్రాల్లో విలీనం చేశారా అని అడిగారు. ఏయే రాష్ట్రాల్లో ఆర్టీసీలు లేవో కూడా చెప్పారు.

RTC Strike: KCR rejects the merger of RTC in government
Author
Hyderabad, First Published Oct 6, 2019, 9:57 PM IST

హైదరాబాద్: ఆర్టీసికి సంబంధించిన విషయాలన్నీ కూలంకషంగా చర్చించి, ఒక నివేదిక సమర్పించడానికి రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి సునీల్ శర్మ అధ్యక్షతన కేసీఆర్ ప్రభుత్వం  ఒక కమిటీని ఏర్పాటు చేసింది.. కమిటీలో సభ్యులుగా రవాణా శాఖ కమీషనర్ సందీప్ సుల్తానియా, టీఎస్ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు, జాయింట్ ట్రాన్స్ పోర్ట్ కమీషనర్ పాండురంగనాయకులున్నారు. వాళ్ళు తమ ప్రతిపాదనలను సోమవారం ప్రభుత్వానికి సమర్పిస్తారు. ఉన్నతాధికారులతో సమీక్ష తర్వాత సిఎంవో ముఖ్యమంత్రి కెసీఆర్ పేరు మీద ఓ ప్రకటన విడుదల చేసింది. సమ్మె చేస్తున్న కార్మికులపై కేసీఆర్ తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేశారు.

“గత నలభై సంవత్సరాలుగా ఆర్టీసీ చుట్టూ అల్లుకున్న వ్యవహారం ఒక నిరంతర సమస్యాత్మకం. దీనికి ఒక శాశ్వత పరిష్కారం కనుగొనాలి. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డాక అనేకరంగాలలో ముందుకు దూసుకుపోతున్నది. ఈ నేపధ్యంలో ఆర్టీసీ లాంటి సమస్యలు ప్రభుత్వాన్ని బ్లాక్ మెయిల్ చేసే విధంగా మారాయి” అని కేసీఆర్ అన్నారు . ఇప్పుడు రాష్ట్రానికి ఈ విషయంలో శాశ్వతమైన లాభం చేకూరాలని, మధ్యప్రదేశ్, ఝార్ఖండ్, చత్తీస్ ఘడ్, మణిపూర్ రాష్ట్రాలలో ఆర్టీసీ లేనే లేదని ఆయన చెప్పారు. 
“బీహార్, ఒరిస్సా, జమ్మూ, కాశ్మీర్, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్ ఉత్తర్ ప్రదేశ్ లాంటి రాష్ట్రాలలో నామ మాత్రంగా వున్నాయని, ఆ విధంగా చూస్తే కర్నాటక తరువాత తెలంగాణలో అత్యధికంగా బస్సులు నడుస్తున్నాయని,. ఇంత మంచిగా ఆర్టీసీని చూసుకుంటుంటే వారు సమ్మెకు దిగడం అవసరమా?” అని కేసీఆర్ అన్నారు 

“భవిష్యత్ లొ ఆర్టీసిని ఏం చేయాలన్నా దృష్టిలో వుంచుకోవాల్సింది మొదలు ప్రజలను. ఆర్ట్టీసీ లో నైపుణ్యమైన, వృత్తిపరమైన యాజమాన్యం వుంది. అన్ని విధాలా స్థిరత్వం సాధించుకునే వీలుంది. మనం ఏదైనా నిర్ణయం తీసుకునే ముందర సమతుల్యం పాటించాలి. ఒక పక్క ప్రయివేట్ భాగస్వామ్యం, మరొక పక్క ఆర్టీసీ యాజమాన్యం వుంటేనే మంచిది. ప్రజలు సమ్మెకు దిగిన ఆర్టీసీ సిబ్బందిమీద చాలా కోపంగా వున్నారు. సోషల్ మీడియాలో కూడా వ్యతిరేకత వస్తున్నది. సమ్మెద్వారా ప్రజలకు ఎంతో అసౌకర్యం కలిగింది. అందుకే ఎట్టి పరిస్థితుల్లో కూడా విధులకు హాజరవని వారిని తిరిగి విధుల్లోకి తీసుకోము. గడపదాటితే బయటికే ....మళ్లీ గడపలోకి వచ్చే సమస్యే లేదు” అని కేసీఆర్ అన్నారు. 

“విలీనం గురించి అఖిల పక్ష సమావేశం జరపాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు. వారికి ఆర్టీసీ విషయంలో మాట్లాడే హక్కులేదు. సీపీఎం అధికారంలో వున్నా, నాడు, పశ్చిమ బెంగాల్ లొ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసారా? కేరళలో చేసారా? బీజేపీ ఎన్నో రాష్ట్రాలలో అధికారంలో వుంది కాని ఎక్కడైనా విలీనం చేసారా? కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు ఏ రాష్ట్రంలోనైనా చేశాయా? అందుకే వాళ్లకు అడిగే హక్కు లేదు. అఖిల పక్ష సమావేశం డిమాండ్ అసంబద్ధం. తెలంగాణ  ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు అందరి కళ్ళూ తెరిపించాలి” అని ముఖ్యమంత్రి అన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios