హైదరాబాద్: ఆర్టీసీ కార్మికుల సమ్మెపై తెలంగాణ ముఖ్యమంత్రి కె.్ చంద్రశేఖర రావు తీవ్ర అసహనంతో, ఆగ్రహంతో ఉన్నట్లు కనిపిస్తున్నారు. టీఎస్ ఆర్టీసీకి ఆయన భారీ షాక్ ఇచ్చారు. ఇందులో భాగంగా పన్ను బకాయిలు చెల్లించాలంటూ తెలంగాణ ట్రాన్స్ పోర్ట్ అథారిటీ (టీటీఎ) ఆర్టీసీకి నోటీసులు జారీ చేసింది. 

రవాణా పన్ను రూపంలో రూ.452.86 కోట్లు చెల్లించాలని ఆర్టీసీకి టీటీఎ కార్యదర్శి మమతా ప్రసాద్ నోటీసు జారీ చేశారు. పన్ను బకాయిలను వెంటనే చెల్లించాలని ఆ నోటీసులు ఆయన సూచించారు. 

ఆర్టీసీ యాజమాన్యం టీఎస్ఆర్టీసీ క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ (సీసీఎస్) నిధులను వాడుకుందని ఆర్టీసీకి తెలంగాణ హైకోర్టు కదుపు ఇచ్చినట్లు తెలంగాణ ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. మొత్తం మీద, ఆర్టీసీ కార్మికులకు వ్యతిరేకంగా కేసీఆర్ ప్రభుత్వం దూకుడుగా వ్యవహరించాలనే నిర్ణయం తీసుకున్నట్లు అర్థమవుతోంది.

విధుల్లో చేరడానికి ఆర్టీసీ కార్మికులు కేసీఆర్ పెట్టిన డెడ్ లైన్ ను ఖాతరు చేయకపోవడంతో కేసీఆర్ తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. ఆర్టీసీని ప్రైవేటీకరించే దిశగానే ఆయన ఆలోచన సాగుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఆర్టీసీ తీరును ఎండగట్టాలని ఆయన భావిస్తున్నట్లు సమాచారం.