RTC Strike: కేసీఆర్ హెచ్చరికలు బేఖాతరు, మెట్టు దిగని కార్మికులు

ఆర్టీసీ సమ్మె 33వ రోజుకు చేరుకుంది. విధుల్లో చేరడానికి ఆర్టీకీ కార్మికులకు కేసీఆర్ పెట్టిన డెడ్ లైన్ ముగిసింది. అయితే, విధుల్లో చేరినవారి సంఖ్య నామమాత్రంగానే ఉంది. కార్మికులు సమ్మెవైపే మొగ్గు చూపారు.

RTC Strike: KCR deadline ends, 373n turned up

హైదరాబాద్: విధుల్లో చేరడానికి తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు పెట్టిన గడువు నామమాత్రం ఫలితం మాత్రమే ఇచ్చింది. ఒక రకంగా ఏ విధమైన ఫలితం ఇవ్వలేదని చెప్పవచ్చు. విధుల్లో చేరడానికి సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులకు మంగళవారం అర్థరాత్రి వరకు కేసీఆర్ సమయం ఇచ్చారు. 

మంగళవారం అర్ధరాత్రి గడువు ముగిసే సమయానికి 373 మంది మాత్రమే విధుల్లో చేరారు. వీరిలో బస్ భవన్ లో 209 మంది విధుల్లో చేరారు. ఇతర డిపోల్లో కేవలం 164 మంది మాత్రమే చేరారు. కార్మికులు సమ్మెకే మొగ్గు చూపినట్లు దీన్ని బట్టి అర్థమవుతోంది.

ఆర్టీసీ కార్మికులు 49 వేల మందికి పైగా సమ్మెలో పాల్గొంటున్నారు. వీరిలో 373 మంది మాత్రం చేరడాన్ని బట్టి పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఈ స్థితిలో ఆర్టీసీ భవితవ్యంపై తీవ్ర ఉత్కంఠ చోటు చేసుకుంది. 

రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 5100 ప్రైవేట్ బస్సులకు రూట్ పర్మిట్లు మంజూరు చేసింది. ఆర్టీసీ సమ్మె ముగియకపోతే మరో 5 వేల ప్రైవేట్ బస్సులకు రూట్ పర్మిట్లు ఇస్తామని, అప్పుడు ఆర్టీసీయే ఉండదని కేసీఆర్ హెచ్చరించారు. అయినా ఆర్టీసీ కార్మికులు మెట్టు దిగి రాలేదు. 

ఆర్టీసీ కార్మికుల సమ్మె బుధవారానికి 33వ రోజుకు చేరుకుంది. ఆర్టీాసీ సమ్మెకు సంబంధించిన విచారణ గురువారం హైకోర్టులో జరగనుంది.ఇదిలా వుంటే, కేంద్రం అనుమతి లేకుండా ఆర్టీసీపై కేసీఆర్ ప్రభుత్వం నిర్థయం తీసుకోలేరని ఆర్టీసీ జేఎసీ కన్వీనర్ అశ్వత్థామ రెడ్డి అంటున్నారు. ఆర్టీసీ కార్మికుల ఉద్యోగులు ఎక్కడికీ పోవని ఆయన అన్నారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios