RTC Strike: కేసీఆర్ ప్రభుత్వానికి బీసీ కమిషన్ నోటీసులు, ఎవరీ ఆచారి?

వీరి ఫిర్యాదును అందుకున్న జాతీయ బీసీ కమిషన్ అత్యవసరంగా పరిగణించాల్సిన కేసు కింద పేర్కొంటూ బీసీ కమిషన్ సభ్యుడైన టి. ఆచారి స్పందించారు.

rtc strike: bc commission serves notice to kcr government, who is this achari

ఆర్టీసీ సమ్మె పైన జోక్యం చేసుకోవాలని జాతీయ బీసీ కమిషన్ ను ఆర్టీసి జేఏసి కోరిన నేపథ్యంలో బీసీ కమిషన్ స్పందించింది. ప్రభుత్వ విపరీత చర్యల వల్ల ఆర్టీసీలో ఉన్న బీసీ కార్మికుల పరిస్థితి  అంధకారంలోకి నెట్టివేయబడుతుందని వారు ఆ విజ్ఞాపనలో ఆర్టీసీ కార్మికులు పేర్కొన్నారు.  

వీరి ఫిర్యాదును అందుకున్న జాతీయ బీసీ కమిషన్ అత్యవసరంగా పరిగణించాల్సిన కేసు కింద పేర్కొంటూ బీసీ కమిషన్ సభ్యుడైన టి. ఆచారి స్పందించారు. ప్రభుత్వ విధానాలను ఏ ప్రాతిపదికన తీసుకున్నరో వచ్చి వ్యక్తిగతంగా వివరణ ఇవ్వాలని ఇటు తెలంగాణ సీఎస్ కు అటు ఆర్టీసీ ఎండికి నోటీసులు జారీ చేసింది. ఈ నెల 25న ఢిల్లీలోని తమ ప్రధాన కార్యాలయంలో కమిషన్ ముందు పూర్తి నివేదికతో హాజరు కావాలని ఆదేశించింది. 

ఇలా ఆచారి అనేపేరు వినిపించడంతో అందరూ ఎవరు ఈ ఆచారి అని మల్ల గుల్లాలు పడుతున్నారు. ఆచారి గారు బీజేపీలో 3దశాబ్దాలకు పైగా కార్యకర్త స్థాయి నుంచి అనేక హోదాల్లో పనిచేసారు. గత రెండు దఫాలు బీజేపీ తరుఫున కల్వకుర్తి నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి చెందారు. ఆయనకు ఎమ్మెల్యే అవ్వాలనేది చిరకాల స్వప్నం. 

పార్టీ కోసం, సిద్ధాంతాన్ని నమ్మి ఇంతకాలం పనిచేసినందుకు అతని సేవను గుర్తిస్తూ బీజేపీ అతన్ని పార్లమెంటు ఎన్నికలకు ముందు మార్చిలో జాతీయ బీసీ కమిషన్ సభ్యుడిగా నియమించింది. 

ఆర్టీసీ కార్మిక నేత అశ్వత్థామ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో రాజ్యాంగ సంక్షోభం వచ్చేలా ఇక్కడి పరిస్థితులున్నాయని, టీడీపీ బంపర్ మెజారిటీతో గెలిచినా పార్టీ కూలిపోలేదా అని మాట్లాడుతున్నారు. మరో [పక్క గవర్నర్ తమిళిసై సౌందర్య రాజన్ గారేమో ఆర్టీసీ సమ్మెపై యాక్టీవ్ గా వ్యవహరిస్తూ కెసిఆర్ ప్రభుత్వానికి పక్కలో బల్లెంలా తయారయ్యారు. 

ఆర్టీసీ సమ్మెకు రోజు రోజుకు మద్దతు పెరిగిపోతుంది. నేటి రాష్ట్రబంద్ కూడా విజయవంతమయ్యింది. ఈ పరిస్థితుల నేపథ్యంలో బీజేపీ నేతలేమో ఏకంగా తెలంగాణను మరో కర్ణాటక చేస్తాం అంటున్నారు. వీటన్నిటిని సమన్వయపరిచి చూసుకుంటే మాత్రం తెలంగాణాలో రాజకీయ ప్రకంపనలు పుట్టుకొస్తాయేమో అనే అనుమానం మాత్రం కలుగక మానదు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios