హైదరాబాద్: టీఎంయూ నేత ఆశ్వత్థామరెడ్డికి ఆర్టీసీ యాజమాన్యం షాక్ ఇచ్చింది. ఉద్యోగం నుండి ఎందుకు తొలగించకూడదో చెప్పాలని గురువారం నాడు షోకాజ్ నోటీసులు జారీ చేసింది.

తెలంగాణలో ఆర్టీసీ సమ్మె తర్వాత ఆర్టీసీ యూనియన్ నేతల తీరుపై సీఎం కేసీఆర్ తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. ఆర్టీసీలో యూనియన్లు ఉండొద్దనే తీరులో వ్యవహరించారు.టీఎంయూ యూనియన్ కు థామస్ రెడ్డి గుడ్ బై చెప్పారు. 

also read:షాక్: టీఎంయూ నేత ఆశ్వత్థామరెడ్డికి షోకాజ్

యూనియన్ నేతలు విధులకు హాజరు కాకూడదనే నిబంధనను కూడ ప్రభుత్వం తొలగించింది. దీంతో ఆశ్వత్థామరెడ్డి విధులకు హాజరు కావడం లేదు. దీంతో ఆయనకు ఆర్టీసీ యాజమాన్యం పలుమార్లు ఆయనకు నోటీసులు ఇచ్చింది.

ఈ నోటీసులపై ఆశ్వత్థామరెడ్డి స్పందించలేదు. దీంతో  ఇవాళ మరోసారి ఆయనకు షోకాజ్ నోటీసు జారీ చేసింది. ఈ నోటీసుపై ఆయన  ఏ రకంగా స్పందిస్తారో చూడాలి