కరీంనగర్‌: కరీంనగర్ -2 ఆర్టీసీ డిపోలో పనిచేస్తున్న గ్యారేజీ కార్మికుడు కరీం ఖాన్ బుధవారం నాడు గుండెపోటుతో మృతి చెందాడు.ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన బాబు అనే ఆర్టీసీ డ్రైవర్ గత నెల 30వ తేదీన మృతి చెందిన విషయం తెలిసిందే.

కరీంనగర్-2 ఆర్టీసీ డిపోలో పనిచేస్తున్న కరీంఖాన్ ఆర్టీస డిపోలో పనిచేస్తున్నాడు. గత నెల 5 వతేదీ నుండి ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్నారు. దీంతో కరీం ఖాన్ రెండు మాసాలుగా సమ్మెలోనే ఉన్నాడు.

అయితే కరీం ఖాన్ గుండెపోటుతో మంగళవారం నాడు ఉదయం మృతి చెందినట్టుగా ఆర్టీసీ జేఎసీ నేతలు ప్రకటించారు. ఆర్టీసీ సమ్మె విషయమై తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ నెల 5వ తేదీ రాత్రి లోపుగా విధుల్లో చేరాలని డెడ్‌లైన్ విధించారు. ఈ డెడ్‌లైన్ పూర్తైంది. 

 కరీమ్ మృతికి ముఖ్యమంత్రి కేసీఆరే బాధ్యత వహించాలని మృతుడి బంధువులు డిమాండ్ చేస్తున్నారు. కరీమ్ ఖాన్ కరీంనగర్ రెండవ డిపోలో మెకానిక్​గా పనిచేస్తున్నాడు. గత 15 రోజుల క్రిత కరీమ్​కి గుండెపోటు వచ్చింది. విషయం గుర్తించిన కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకెళ్లారు

 రెండ్రోజుల తర్వాత డిశ్చార్జ్ అయి ఇంటికి వచ్చాడు. కొద్ది రోజుల క్రితం డ్రైవర్ బాబు అంతిమయాత్రలో పాల్గొన్నాడు. అక్కడ మరోసారి గుండెపోటు వచ్చి కుప్పకూలిపోయినట్టుగా  కుటుంబసభ్యులు చెప్పారు. వెంటనే కరీం ఖాన్ ‌ను ప్రతిమ ఆసుపత్రికి తరలించారు.కరీం ఖాన్ ప్రతిమ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం నాడు ఉదయం మృతి చెందాడు.