Asianet News TeluguAsianet News Telugu

ఉద్యోగం రాదేమోనని మనస్తాపం... ఆర్టీసీ ఉద్యోగి ఆత్మహత్య

హైదరాబాద్​ కుల్సుంపురా పీఎస్ పరిధిలోని కార్వాన్‌లో ఉండే సురేందర్​గౌడ్ రాణిగంజ్–2 డిపోలో 14 ఏళ్లుగా ఆర్టీసీలో కండక్టర్​గా పని చేస్తున్నాడు. లోన్ తీసుకొని ఇల్లు కట్టుకున్న సుదర్శన్ కు డబ్బులు కట్టకపోవడంతో చెక్ బౌన్స్ అయ్యిందని ఫైనాన్స్ సంస్థ నుంచి ఫోన్ వచ్చింది. 

RTC Conductor commits suicide in rajendranagar
Author
Hyderabad, First Published Oct 14, 2019, 7:32 AM IST


తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ సమ్మె కొనసాగుతోంది. సమ్మె కారణంగా రాష్ట్రంలో ప్రజలు ఇబ్బందులుపుడుతూనే ఉన్నారు. ఈ సమ్మె కారణంగా ప్రజలు మాత్రమే కాదు... ఆర్టీసీ కార్మికులు కూడా అవస్థలు పడుతున్నారని తెలుస్తోంది. మళ్లీ తమకు ఉద్యోగం వస్తుందో రాదో అనే బెంగ చాలా మందిలో మొదలయ్యింది. ఈ క్రమంలోనే ఓ ఆర్టీసీ కండక్టర్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన హైదరాబాద్ నగరంలోని రాజేంద్రనగర్ లో చోటుచేసుకుంది.

హైదరాబాద్​ కుల్సుంపురా పీఎస్ పరిధిలోని కార్వాన్‌లో ఉండే సురేందర్​గౌడ్ రాణిగంజ్–2 డిపోలో 14 ఏళ్లుగా ఆర్టీసీలో కండక్టర్​గా పని చేస్తున్నాడు. లోన్ తీసుకొని ఇల్లు కట్టుకున్న సుదర్శన్ కు డబ్బులు కట్టకపోవడంతో చెక్ బౌన్స్ అయ్యిందని ఫైనాన్స్ సంస్థ నుంచి ఫోన్ వచ్చింది. డ్యూటీ రాదేమోనని మనస్థాపం చెందిన సుదర్శన్ గౌడ్ ఉరి వేసుకుని సూసైడ్ చేసుకున్నాడు.

కుటుంబసభ్యులు దగ్గర్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా అప్పటికే సురేందర్ చనిపోయినట్లు డాక్టర్లు చెప్పారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సురేందర్ మృతదేహాన్ని పోస్టుమార్టానికి ఉస్మానియా మార్చురీకి తరలించారు. మృతుడికి భార్య, కొడుకు, కూతురు ఉన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios