నల్గొండ జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్సు ఆయిల్ ట్యాంకర్‌ను ఢీకొట్టడంతో ఇద్దరు మరణించారు. వివరాల్లోకి వెళితే.. విజయవాడ గన్నవరం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఆదివారం రాత్రి 40 మంది ప్రయాణికులతో హైదరాబాద్‌కు బయలుదేరింది. 

ఈ క్రమంలో నల్గొండ జిల్లా కట్టంగూరు మండలటం ముత్యాలమ్మగూడెం వద్ద ముందు వెళుతున్న ఆయిల్ ట్యాంకర్‌ను బస్సు వెనుక నుంచి వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కండక్టర్.. బస్సుకు, లారీకి మధ్యలో ఇరుక్కుని చనిపోగా, ప్రయాణికుల్లో ఓ మహిళ అక్కడికక్కడే మరణిచింది. సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన 15 మంది క్షతగాత్రులను నార్కట్‌పల్లిలోని కామినేని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.