Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణ: ఫారిన్ లగ్జరీ కార్లపై ఆర్టీఏ కొరడా.. భారీగా తనిఖీలు, రూ.5 కోట్ల జరిమానా

హైదరాబాద్ శివారులోని శంషాబాద్‌లో రవాణా శాఖ అధికారులు మెరుపుదాడులు చేశారు. తెలంగాణ రవాణా శాఖ, ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆధ్వర్యంలో అధికారుల బృందం విదేశీ వాహనాలపై కొరడా ఝళిపించింది.
 

rta officials raids in hyderabad
Author
Hyderabad, First Published Aug 15, 2021, 6:34 PM IST

హైదరాబాద్ శివారులోని శంషాబాద్‌లో రవాణా శాఖ అధికారులు మెరుపుదాడులు చేశారు. తెలంగాణ రవాణా శాఖ, ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆధ్వర్యంలో అధికారుల బృందం విదేశీ వాహనాలపై కొరడా ఝళిపించింది. తెలంగాణలో రోడ్ ట్యాక్స్ కట్టకుండా తిరుగుతున్న పది వాహనాలపై కేసులు నమోదు చేశారు. విదేశీ వాహనదారులకు సుమారు రూ. 5 కోట్ల జరిమానా విధించారు.  

కాగా, విదేశాల నుండి దిగుమతి చేసుకుంటున్న కారులకు భారీగా పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఇతర దేశాల నుండి కారులు దిగుమతి చేసుకునే రాయబారులకు పన్ను నుండి మినహాయింపు ఉంటుంది. దీనిని అదనుగా తీసుకుని విచ్చలవిడిగా విదేశాల నుండి కార్లు దిగుమతి చేస్తుంది ముంబై మాఫియా.  ఈ వ్యవహారం ఇటీవల దేశంలో సంచలనం సృష్టించింది. విదేశాల నుండి వస్తున్న కార్లు ముంబై నుండి మణిపూర్ లో ఓ మారుమూల షో రూంలో రిజిస్ట్రేషన్ అవుతున్నాయి. రాయబారులు పేరుతో చెల్లించాల్సిన పన్ను ఎగొట్టెందుకు ముఠా ప్లాన్ చేస్తుంది. ఏడాది కాలంలో ఇరవైకి పైగా కార్లు దిగుమతి అయ్యాయి. అయితే ముంబై ముఠా నుండి వస్తున్న కార్లు ఎక్కువ శాతం హైదరాబాద్ ప్రముఖులే కోనట్టు అభియోగం ఉంది.

Follow Us:
Download App:
  • android
  • ios