జడ్సీ హైస్కూల్ లో ఊడిపడిన పైకప్పు.. విద్యార్థినులకు గాయాలు..
హనుమకొండలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో ప్రమాదం చోటు చేసుకుంది. తరగతి గది పైకప్పు కూలింది. దీంతో ఆ పెచ్చులు పడి విద్యార్థినులకు గాయాలయ్యాయి.
హనుమకొండ : Hanumakonda జిల్లా హసన్ పర్తి జడ్పీ హైస్కూల్ లో ప్రమాదం జరిగింది. పాఠశాలలోని ఓ తరగతి గదిలో పై కప్పు పెచ్చులు ఊడిపడి studentsకు గాయాలయ్యాయి. పదో తరగతి విద్యార్థులున్న గదిలోని పైకప్పు పెచ్చులు అకస్మాత్తుగా ఊడిపడటం వల్ల ఐదుగురు విద్యార్థినులు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే వారిని school యాజమాన్యం స్థానిక ఆస్పత్రికి తరలించింది.
పాఠశాలలో జరిగిన ఈ ఘటన గురించి తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందారు. వెంటనే స్కూల్ వద్దకు పరుగులు తీశారు. గాయపడిన విద్యార్థినులకు వెంటనే ప్రాథమిక చికిత్స అందించారు. మిగతా విద్యార్థుల తల్లిదండ్రులు కూడా తమ పిల్లల భద్రత మీద ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇదిలా ఉండగా, నిరుడు డిసెంబర్ లో చెన్నైలో ఇలాంటి సంఘటనే జరిగింది. Tamilnadu లోని Thirunelveli జిల్లాలోని ప్రైవేట్ పాఠశాలకు చెందిన బాత్‌రూమ్ గోడ కూలి ముగ్గురు విద్యార్ధులు మృతి చెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. విద్యార్థులు Schaffter Higher Secondary school లో విద్యనభ్యసిస్తున్నారు. ఈ విషయం తెలిసిన వెంటనే రెస్క్యూ బృందం సంఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.గోడ కూలిపోవడంతో 9వ తరగతి చదివే అన్భళగన్, ఎనిమిదవ తరగతి చదివే విశ్వరంజన్, ఆరో తరతతి చదివే సుతేష్ లు మరణించారు. సంజయ్(8వతరగతి), ప్రకాష్ (9వ తరగతి),. షేక్ అబూబకర్ కిదానీ( 12వ తరగతి) అబ్దుల్లా (7వ తరగతి) లు గాయపడ్డారని పోలీసులు తెలిపారు.
మృతుల కుటుంబాలకు తమిళనాడు సీఎం స్టాలిన్ సానుఃభూతి తెలిపారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 10 లక్షల పరిహారాన్ని ప్రకటించారు సీఎం. ఈ ఘటనలో గాయపడిన విద్యార్ధులకు ఒక్కొక్కరికి రూ. 3 లక్షలను ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఘటనపై రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ మంత్రి అన్బిల్ మహేష్ పొయ్యమొళి స్పందించారు. ఈ ఘటనను దురదృష్టకరమన్నారు. ఈ పాఠశాలను తక్షణమే తనిఖీ చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. 100 ఏళ్లకుపైగా నడుస్తోన్న స్కూల్లో బిల్డింగ్స్, గోడలు శిథిలావస్థకు చేరుకున్నాయి. అయితే వీటిని మరమ్మత్తులు చేయాలని కోరుతున్నా పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపించారు.