హైదరాబాద్‌లో కరోనా టీకాతో వృద్ధ దంపతులకి టోపీ పెట్టిందో ప్రైవేట్ ఆసుపత్రి నర్స్. వ్యాక్సినేషన్ చేస్తానని చెప్పి మత్తు మందు ఇచ్చి ఒంటిపై వున్న నగలు అపహరించింది.

మొదటిసారి పాయసంలో మత్తు మందు కలిపి ఇచ్చినప్పటికీ ఆ దంపతులకి షుగర్ వుండటంతో పాయసం పడేశారు. రెండోసారి కరోనా టీకా పేరుతో స్కెచ్ వేసింది నర్స్. వ్యాక్సిన్ అంటూ మత్తు ఇంజెక్షన్ ఇచ్చింది.

దీంతో దంపతులు స్పృహ తప్పడంతో అనంతరం నగలను ఎత్తుకెళ్లింది. మత్తు నుంచి తేరుకున్నాకా మోసపోయామని గ్రహించిన వృద్ధులు మీర్‌పేట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు కిలాడీ నర్స్‌ను అదుపులోకి తీసుకున్నారు.