జూబ్లీహిల్స్‌ కో–ఆపరేటివ్‌ హౌస్‌ బిల్డింగ్‌ సొసైటీలో అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. కోట్లు విలువజేసే స్థలాన్ని తక్కువకే అమ్మారని ఆరోపణలు వచ్చాయి. ఈ ల్యాండ్ ను కొనుగోలు చేసింది ప్రముఖ హీరో చిరంజీవి అని సొసైటీ సభ్యుడు ఫిర్యాదులో పేర్కొన్నారు. 

జూబ్లీహిల్స్‌ కో–ఆపరేటివ్‌ హౌస్‌ బిల్డింగ్‌ సొసైటీలో అక్రమాలు వెలుగులోకి రావ‌డం క‌ల‌క‌లం రేపుతున్నాయి. మార్కెట్ లో కోట్లాది ధ‌ర ప‌లికే స్థ‌లాన్ని త‌క్కువకే విక్ర‌యించారు. త‌రువాత మిగిలిన డ‌బ్బులు వివిధ మార్గ‌ల ద్వారా దండుకున్నారు. ఈ వ్య‌వ‌హారంలో ప‌లువురు ప్ర‌ముఖుల హ‌స్తం ఉన్న‌ట్టు తెలుస్తోంది. 

జూబ్లీహిల్స్‌ కో–ఆపరేటివ్‌ హౌస్‌ బిల్డింగ్‌ సొసైటీ ప్రెసిడెంట్‌ బి. రవీంద్రనాథ్ (B. Rabindranath), (టీవీ–5 ఓన‌ర్ బీఆర్‌ నాయుడు) కోశాధికారి పి.నాగరాజులు (P. Nagarajulu) సొసైటీ నిబంధ‌న‌ల‌కు విరుద్దంగా కోట్లు విలువజేసే జాగాను తెలుగు సినీ న‌టుడు చిరంజీవి (Chiranjeevi)కి అమ్మార‌నే ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి. కాగా ప్రెజెంట్ జూబ్లీహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 25లో ఆయ‌న‌కు ఇల్లు ఉంది. ఆ ఇళ్లుకు ఆనుకునే వెన‌కాల భాగంలో షేక్ పేట (SheikhPeta) ప‌రిధిలోని స‌ర్వే నెంబ‌ర్ 120 ( దీని పాత సర్వే నంబర్‌ 403/1), హకీంపేట (Hakimpet) గ్రామం కింద వ‌చ్చే ఓ ల్యాండ్ ను అక్ర‌మంగా అమ్మారు. సర్వే నెంబర్‌ 102/1లోని 595 గజాల అదనపు స్థలాన్ని (Additional Land) అక్రమంగా Chiranjeevi కి విక్ర‌యించారు. రిజిస్ట్రేష‌న్ కూడా చేయించారు. 

కాగా ఓపెన్ మార్కెట్ లో ఈ ల్యాండ్ కు బాగా విలువ ఉంది. సుమారుగా ఒక గ‌జానికి రూ. 4 లక్షల కంటే ఎక్కువ‌గానే అమ్ముడుపోతోంది. కానీ దీనిని గ‌వ‌ర్న‌మెంట్ రేట్ ప్ర‌కారం రూ. 64 వేలకే గ‌జం చొప్ప‌న అమ్మేసి రిజిస్ట్రేష‌న్ ప్ర‌క్రియ పూర్తి చేశారు. అయితే ఈ ల్యాండ్ కు ఓపెన్ మార్కెట్ లో రూ. 23.80 కోట్ల ధ‌ర పలికే అవ‌కాశం ఉండ‌గా.. కేవ‌లం రూ. 3 కోట్ల 80 ల‌క్ష‌ల‌కే దీనిని అమ్మేశారు. అనంత‌రం వెన‌కాల నుంచి పెద్ద మొత్తంలో ముడుపులు తీసుకున్న‌ట్టు తీవ్ర ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి. 

జూబ్లీహిల్స్‌ కో–ఆపరేటివ్‌ హౌస్‌ బిల్డింగ్‌ సొసైటీలో జ‌రిగిన అక్ర‌మాల‌ను ఆ సొసైటీ స‌భ్యుడు ప్రభాకర్‌రావు గుర్తించారు. జీహెచ్‌ఎంసీ జోనల్‌ కమిషనర్ (Zonal Commissioner)కు ఫిర్యాదు చేశారు. ఆయ‌నతో పాటు విజిలెన్స్, కో–ఆపరేటివ్‌ రిజిస్ట్రార్ (Registrar of Vigilance, Co-operative)ల దృష్టికి తీసుకెళ్లి ఫిర్యాదు కూడా చేశారు. దీంతో ఈ అక్ర‌మాలు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. 

ప్ర‌భాక‌ర్ రావు ఫిర్యాదుల‌ను ప‌రిశీలించిన అధికారులు క్షేత్ర‌స్థాయిలో ప‌ర్య‌టించారు. షేక్‌పేట మండల సర్వేయర్‌ సాయికాంత్ (mandal Surveyor Saikant), డిప్యూటీ ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ సర్వేయర్‌ రాజేశం (Deputy Inspector of Surveyor Rajesham)లు ఆ స్థ‌లం ఉన్న చోటుకు వ‌చ్చారు. త‌నిఖీలు నిర్వ‌హించారు. కాగా ఈ విష‌యంలో సొసైటీ స‌భ్యుడు ప్ర‌భాక‌ర్ రావు మీడియాతో మాట్లాడారు. ఇప్పుడు రిజిస్ట్రేష‌న్ చేసిన భూమి గ‌వ‌ర్న‌మెంట్ కు చెందిన‌ది అని తెలిపారు. గ‌వ‌ర్నమెంట్ ప‌ర్మిష‌న్ లేకుండానే కొంద‌రు మెంబ‌ర్స్ దీనిని అక్ర‌మంగా అమ్మేసి రిజిస్ట్రేష‌న్ చేయించార‌ని ఆరోపించారు. ఈ తతంగం అంతా సబ్‌ రిజిస్ట్రార్ (Sub Registrar) కు తెలిసని అన్నారు. అందుకే సొసైటీ లేఔట్ (Lay out)ను చూడ‌కుండానే రిజిస్ట్రేషన్ ప్ర‌క్రియ పూర్తి చేశార‌ని చెప్పారు. 

ఈ తతంగం మొత్తంలో జూబ్లీహిల్స్‌ కో–ఆపరేటివ్‌ హౌస్‌ బిల్డింగ్‌ సొసైటీ రూల్స్ ను పాటించ‌లేద‌ని, వాటిని తుంగ‌లో తొక్కేశార‌ని ఆయ‌న ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఈ వ్య‌వ‌హారాన్ని క‌నీసం సొసైటీ స‌మావేశంలో స‌భ్యుల‌కు అధ్య‌క్షుడు, కోశాధికారి తెలియ‌జేయ‌లేద‌ని తెలిపారు. అయితే తాను ఈ విష‌యంలో అధికారులకు ఫిర్యాదు చేసిన ద‌గ్గ‌ర నుంచి బెదిరింపు ఫోన్ కాల్స్ వ‌స్తున్నాయ‌ని ఆరోపించారు. కానీ వారెవ‌రో తెలియం లేద‌ని అన్నారు. ఫిర్యాదు వాప‌స్ తీసుకోక‌పోతే తీవ్ర ప‌రిణామాలు ఉంటాయ‌ని హెచ్చ‌రిస్తున్నార‌ని తెలిపారు.