Asianet News TeluguAsianet News Telugu

హైదరాబాద్ : హిమాయత్ నగర్‌లో ఒక్కసారిగా కుంగిన రోడ్డు..పలువురికి గాయాలు, స్థానికులు పరుగులు

హైదరాబాద్ హిమాయత్‌నగర్‌లో రోడ్డు కుంగిపోవడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు .  ఈ ఘటనలో ఇద్దరికి గాయాలయ్యాయి. మరోవైపు ప్రమాదం కారణంగా ఆ ప్రాంతంలో వాహనాల రాకపోకలకు సైతం ఆటంకం కలుగుతోంది.

road collapse at himayat nagar hyderabad
Author
First Published Jan 28, 2023, 3:41 PM IST

హైదరాబాద్ హిమాయత్‌నగర్‌లో రోడ్డు కుంగిపోవడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. స్టానిక స్ట్రీట్ నెంబర్ 5లో వున్న రోడ్డు శనివారం ఒక్కసారిగా కుంగిపోయింది. దీంతో ఆ ప్రాంతంలో నిలిపివున్న ట్రక్కు పది అడుగుల లోతులో కూరుకుపోయింది. ఈ ఘటనలో ఇద్దరికి గాయాలయ్యాయి. మరోవైపు ప్రమాదం కారణంగా ఆ ప్రాంతంలో వాహనాల రాకపోకలకు సైతం ఆటంకం కలుగుతోంది. సమాచారం అందుకున్న పోలీసులు, జీహెచ్ఎంసీ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకున్నారు. 

Also REad: హైద్రాబాద్ గోషామహల్ చాక్నవాడిలో కుంగిన పెద్ద నాలా: కుప్పకూలిన దుకాణాలు, పడిపోయిన వాహనాలు

ఇకపోతే .. గత నెలలో గోషామహల్  చాక్నవాడిలోనూ పెద్దనాలా కుంగిపోయింది. ఈ నాలాలో  కార్లు, ఆటోలు, ద్విచక్రవాహనాలు, దుకాణాలు పడిపోయాయి. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. 1980, 1990లలో  కూడా  ఈ నాలా  కుప్పకూలిందని స్థానికులు చెబుతున్నారు. అఫ్సర్ సాగర్, దారుసలాం, చాక్నవాడి , గోషామహల్  పోలీస్ స్టేడియం, ఉస్మాన్ గంజ్, గౌలిగూడ మీదుగా మూసీ నదిలోకి ఈ నాలా ద్వారా  మురికి నీరు  ప్రవహించనుంది. ఇష్టానుసారంగా  ఈ నాలాపై ఆక్రమ నిర్మాణాలు వుండటం వల్లే నాలా కుంగిపోయిందని అధికారులు చెబుతున్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios