వరంగల్ - ఖమ్మంపై జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో ఇద్దరు స్నేహితులు చనిపోయారు. రాత్రి సమయంలో మామునూరు ప్రాంతానికి వచ్చే సరికి గుర్తు తెలియని వాహనం వీరు ప్రయాణిస్తున్న బైక్ ను ఢీ కొట్టింది. దీంతో వారిద్దరు ఘటనా స్థలంలోనే మృతిచెందారు.
వారిద్దరు స్నేహితులు. చాలా కాలంగా కలిసే ఉంటున్నారు. జీవితంలో గొప్పగా ఎదగాలని కలలు కన్నారు. ద్దరూ శుభకార్యాల్లో క్యాటరింగ్ చేస్తూ జీవిస్తున్నారు. అంతా బాగానే ఉందనుకుంటున్న సమయంలో రోడ్డు ప్రమాదం వీరిని బలి తీసుకుంది. బుధవారం రాత్రి సమయంలో చోటు చేసుకున్న ఓ యాక్సిడెంట్ లో ఇద్దరూ చనిపోయారు.
ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. వరంగల్ (warangal) జిల్లాలోని శివనగర్ (shivanagar) కు చెందిన పోలెబాక వినయ్ (polebaka vinay) (28), కాశీబుగ్గ కు చెందిన చిన్నపల్లి ప్రదీప్ (chinnapalli pradeep) (18) ఇద్దరూ స్నేహితులు. వీరి వృత్తి క్యాటరింగ్. పెళ్లిలలో, ఫంక్షన్ లో వారి వృత్తి క్యాటరింగ్ చేస్తూ జీవనం సాగిస్తుంటారు. ఈ క్రమంలో ఇద్దరు స్నేహితులు కలిసి బైక్ (bike)పై వర్థనపేట (vardhannapeat) మండలంలోని పంథిని (panthini) గ్రామంలోని వినయ్ వాళ్ల చిన్నమ్మ ఇంటికి వెళ్లారు. అక్కడ అర్ధరాత్రి సమయం వరకు ఉన్నారు. ఆ సమయంలో తిరిగి ఇంటికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో వరంగల్-ఖమ్మం నేషనల్ హైవేపై వెళ్తూ రాత్రి మామునూరు (mamunuoor) గ్రామ శివారులోకి చేరుకున్నారు. అక్కడికి చేరుకునే సరికి గుర్తు తెలియని వాహనం వీరు ప్రయాణిస్తున్న బైక్ ను ఢీకొట్టి వెళ్లిపోయింది. దీంతో ఇద్దరు స్నేహితులు అక్కడే మృతి చెందారు.
ఈ ఘటనను చూసిన వినయ్, ప్రదీప్ తల్లిదండ్రులు తీవ్రంగా రోదించారు. చేతికి అందిన కుమారులు చనిపోవడంతో ఆ గ్రామంలో విషాద చాయలు అలుముకున్నాయి. ఈ ప్రమాదం విషయం తెలుసుకున్న
పోలీసులు ఘటన స్థాలానికి చేరుకున్నారు. మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసుల కేసు నమోదు చేసుకున్నారు. కేసు దర్యాప్తులో ఉంది.
ఇదిలా ఉండగా... మూడు రోజుల కిందట హైదరాబాద్ (hyderabad) లోని గచ్చిబౌలి (gacchibouli) ట్రిపుల్ ఐటీ జంక్షన్ (iit junction) వద్ద చోటుచేసుకున్న ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మరణించారు. వివరాలు ఇలా ఉన్నాయి. ట్రిపుల్ ఐటీ జుంక్షన్ వద్ద ఉన్న సబ్ స్టేషన్ గేట్‌ను వేగంగా వచ్చిన ఓ బైక్ ఢీకొట్టింది. దీంతో బైక్‌పై ఉన్న ముగ్గురిలో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. ఈ ప్రమాదంలో మరోకరికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో అతడిని ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వివరాలు సేకరించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఆదిలాబాద్ (adilabad) జిల్లా భోరజ్ (bhoraj) చెక్ పోస్టు (check post) ప్రాంతంలో ఇటీవల వరుసుగా మూడు రోజుల పాటు మూడు రోడ్డు ప్రమాదాలు జరిగాయి. వీరు ముగ్గురు బైక్ పైనే ఉన్నప్పుడు యాక్సిడెంట్ జరగడం, ఒక ప్రాంతంలో జరగడం యాదృశ్చికం. మృతుల్లో ఒకరు టీచర్ (teacher) కాగా, మరొకరు స్టూడెంట్ (student), మరొకరు ఓ గ్రామానికి పెద్ద మనిషి. ఇలా మూడు రోజుల పాటు ఘటనలు జరగడంతో స్థానికులు చెక్ పోస్టు వద్ద ఆందోళన నిర్వహించారు. అనంతరం హైవే రోడ్డుపై బైఠాయించారు. ప్రమాదాలు జరకుండా సర్వీసు రోడ్డు నిర్మించాలని డిమాండ్ చేశారు. పోలీసులు అక్కడికి చేరుకొని ఆందోళన విరమింపజేశారు.
