కరెంట్ పోల్‌ను ఢీకొట్టి.. మూడు పల్టీలు కొట్టి..

road accident in shaik pet
Highlights

కరెంట్ పోల్‌ను ఢీకొట్టి.. మూడు పల్టీలు కొట్టి.. 

హైదరాబాద్ షేక్ పేట దర్గా సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఫిల్మ‌్‌నగర్ నుంచి మణికొండ వైపుగా వెళ్తున్న టీఎస్07ఎఫ్ఎక్స్ 3699 నంబరు గల కారు వేగంగా వచ్చి రోడ్డు పక్కనున్న ఎలక్ట్రీక్ పోల్‌ను ఢీకొట్టింది. ఆ వేగానికి పోల్ కూలిపోగా.. కారు మూడు ఫల్టీలు కొట్టింది. ప్రమాదంలో  22 ఏళ్ల విద్యార్థి మరణించగా.. మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు.. మృతుడిని సుంకరపల్లి మండలానికి చెందిన రాహుల్ రెడ్డిగా గుర్తించారు. ప్రమాదం జరిగిన వెంటనే కొనఊపిరితో ఉన్న రాహుల్ రెడ్డిని స్థానికులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించినప్పటికీ.. అతను అప్పటికే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు.  మితీమిరీన వేగమే ప్రమాదానికి కారణంగా పోలీసులు భావిస్తున్నారు. ప్రమాద సమాచారాన్ని పోలీసులు అతని కుటుంబ సభ్యులకు తెలియజేశారు.

loader