నల్గొండ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. దేవరకొండ డీఎస్పీ నాగేశ్వరరావు ప్రయాణిస్తున్న వాహనం ఢీకొని ఓ వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. బాధ్యత గల పదవిలో వుండి.. తోటి వ్యక్తిపట్ల మానవత్వం లేకుండా ప్రవర్తించారంటూ డీఎస్పీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
నల్గొండ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. దేవరకొండ డీఎస్పీ నాగేశ్వరరావు ప్రయాణిస్తున్న వాహనం ఢీకొని ఓ వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. విధి నిర్వహణలో భాగంగా చండూరు నుంచి మునుగోడు వెళ్తున్నారు దేవరకొండ డీఎస్పీ. ఈ క్రమంలో ఆయన వాహనం ఎదురుగా వస్తున్న బైక్‌ను అతివేగంగా ఢీకొట్టారు. దీంతో ఓ వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. ఘటన జరిగిన వెంటనే డీఎస్పీ వాహనం దిగలేదు. కాసేపటి తర్వాత తీరిగ్గా వాహనం దిగి బాధితుడి పరిస్థితిని గమనించారు. స్థానికుల సాయంతో బాధితుడిని డిక్కీలో కుక్కి ఆసుపత్రికి తీసుకెళ్లారు. బాధ్యత గల పదవిలో వుండి.. తోటి వ్యక్తిపట్ల మానవత్వం లేకుండా ప్రవర్తించారంటూ డీఎస్పీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే ఇదేనా అంటూ డీఎస్పీపై నెటిజన్లు మండిపడుతున్నారు.
Add Asianetnews Telugu as a Preferred Source

