కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 16 మంది మరణించిన సంఘటన మరిచిపోకముందే తెలంగాణలో మరో ప్రమాదం జరిగింది. కరీంనగర్ జిల్లా అడవిసోమన్‌పల్లి బ్రిడ్జీ వద్ద ఆర్టీసీ బస్సు బోల్తా పడింది.

వంతెన దగ్గర సుమారు 9 మీటర్ల లోతులో బస్సు పడిపోయింది. డ్రైవర్ గుట్కా ప్యాకెట్ వేసుకుంటుండగా బస్సు అదుపు తప్పి బోల్తా కొట్టింది. ప్రమాద సమయంలో బస్సులో 63 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరిలో ఐదుగురికి తీవ్రగాయాలవ్వడంతో మంథని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఘటన తర్వాత బస్సు డ్రైవర్ పరారీలో ఉన్నట్లు సమాచారం.