జనగామ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం పాలయ్యారు. స్టేషన్‌ఘన్‌పూర్ మండలం చాగల్లు దగ్గర మూడు కార్లు ఢీకొనడంతో దీంతో వాటిలో ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే దుర్మరణం పాలవ్వగా.. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.

ప్రమాదాన్ని గమనించిన స్థానికులు గాయపడిన వారిని వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించి, పోలీసులకు సమాచారం అందించారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్ధితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.