హైదరాబాద్‌లో దారుణం జరిగింది. డ్రంకన్ డ్రైవ్ ప్రాణాల మీదకు తెచ్చింది. మద్యం మత్తులో కారు నడిపి ప్రాణాలతో పోరాడుతోంది ఓ జంట. శనివారం ఐకియా జంక్షన్ సమీపంలోని అండర్ పాస్ వద్ద కారు అదుపు తప్పి గోడను ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో భార్యాభర్తలు తీవ్ర గాయాల పాలయ్యారు. తాగి వాహనం నడపటం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. ప్రమాద సమయంలో భార్య డ్రైవింగ్ చేస్తుండగా, భార్య పక్కన కూర్చొన్నాడు. ప్రస్తుతం వీరి పరిస్ధితి విషమంగా వుందని పోలీసులు చెబుతున్నారు.