సికింద్రాబాద్ ప్యాట్నీ సెంటర్ సిగ్నల్ వద్ద గురువారం రోడ్డు ప్రమాదం సంభవించింది. సమాచారం అందుకున్న పోలీసులు క్యాబిన్‌లో చిక్కుకుపోయిన డ్రైవర్‌ను బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నారు.

సికింద్రాబాద్ ప్యాట్నీ సెంటర్ సిగ్నల్ వద్ద గురువారం రోడ్డు ప్రమాదం సంభవించింది. రెండు డీసీఎం వ్యాన్‌లు ఢీకొట్టుకున్నాయి. అయితే ఓ డ్రైవర్‌ క్యాబిన్‌లో ఇరుక్కుపోయాడు. అయితే ఓ మనిషి విలవిలలాడిపోతుంటే జనం మాత్రం ఫోటోలు తీస్తూ చోద్యం చోద్యం చూశారు. డీసీఎం డ్రైవర్ మద్యం సేవించి వున్నట్లుగా తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఇతనిని బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నించారు. అయితే ప్రమాదం కారణంగా ఆ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.