మెదక్: మెదక్ జిల్లా నార్సింగ్ శివారులో జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ ప్రైవేట్ బస్సు లారీని ఢీకొట్టడంతో 15 మంది తీవ్రగాయాలపాలయ్యారు. వివరాల్లోకి వెళ్తే అత్యంత వేగంగా వెళ్తున్న ఆరెంజ్ ప్రైవేట్ ట్రావెల్ బస్సు మెదక్ జిల్లా నార్సింగ్ జాతీయ రహదారిపై లారీని ఢీ కొట్టింది. 

ఈ ఘటనలో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రమాదం జరగడంతో రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు.