హైద‌రాబాదులోని రాజేంద్రన‌గ‌ర్ ఓఆర్ఆర్ పై రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. శంషాబాద్ ప్రాంతం నుంచి హైద‌రాబాద్ లోని గ‌చ్చిబౌలి వైపు వెళ్తుండ‌గా ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది

హైద‌రాబాదులోని రాజేంద్రన‌గ‌ర్ (rajendra nagar) ఓఆర్ఆర్ పై (orr) రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. శంషాబాద్ (shamshabad) ప్రాంతం నుంచి హైద‌రాబాద్ లోని గ‌చ్చిబౌలి (gacchibowli) వైపు వెళ్తుండ‌గా ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. అతి వేగంగా ఈ ప్ర‌మాదానికి ప్ర‌ధాన కార‌ణ‌మ‌ని పోలీసులు తెలుపుతున్నారు. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన పూర్తి వివ‌రాలు ఇంకా తెలియాల్సి ఉంది. 

అతివేగంగా, నిర్ల‌క్ష‌మైన డ్రైవింగ్ వ‌ల్ల ఓఆర్ఆర్ ల‌పై త‌ర‌చూ ప్ర‌మాదాలు జ‌రుగుతున్నాయి. గ‌తేదాది నవంబ‌ర్ 22వ తేదీన అబ్దుల్లాపూర్ మెట్టు పోలీస్ స్టేషన్ పరిధి కోహెడ వద్ద ఔటర్ రింగు రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ముందుగా వెళుతున్న గుర్తు తెలియని వాహనాన్ని కారు ఢీకొట్ట‌డంతో ఈ ప్ర‌మాదం చోటు చేకుంది. ఇందులో ఇద్ద‌రు త‌ల్లీ కూతుర్లు మృతి చెందారు. మ‌రో ముగ్గురు గాయాల‌ప‌ల‌య్యారు. 

అలాగే గ‌తేడాది అక్టోబ‌ర్ 8న రంగారెడ్డి జిల్లా నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓఆర్ఆర్ పై ఘోర రోడ్డు ప్రమాదం జ‌రిగింది. రెండు కార్లు మితిమీరిన వేగంతో ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. కార్లలో ఉన్న ఆరుగురికి తీవ్రగాయాలయ్యాయి. శంషాబాద్ నుంచి గచ్చిబౌలికి వెళ్తుండగా నార్సింగి సర్కింల్ వద్ద రెండు కార్లు అతివేగంగా వచ్చి ఒకదానికొకటి ఢీ కొట్టాయి. దీంతో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్ర‌మాదంలో గాయాల‌పాలైన వారిని వెంట‌నే హాస్పిట‌ల్ కు తీసుకెళ్లారు. కారు నడుపుతున్న ఇద్దరు వ్యక్తులు ప్రమాదంలో అక్కడిక్కడే మృతి చెందారు.