ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పెద్దపల్లిలో గోదావరి నదిలో దూకి ఓ యువతి ఆదివారం నాడు ఆత్మహత్యకు ప్రయత్నించింది.  ఆత్మహత్యాయత్నం చేసిన యువతిని రివర్ పోలీసులు కాపాడారు.


కరీంనగర్: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పెద్దపల్లిలో గోదావరి నదిలో దూకి ఓ యువతి ఆదివారం నాడు ఆత్మహత్యకు ప్రయత్నించింది. ఆత్మహత్యాయత్నం చేసిన యువతిని రివర్ పోలీసులు కాపాడారు.గోదావరి నదిలో యువతి దూకిన విషయాన్ని గుర్తించిన రివర్ పోలీసులు వెంటనే గోదావరి నదిలో స్పీడ్ బోటు సహాయంతో యువతిని రక్షించారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

యువతిని గోదావరిఖని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో యువతికి చికిత్స అందిస్తున్నారు. యువతి నుండి పోలీసులు సమాచారాన్ని సేకరిస్తున్నారు. యువతి కుటుంబ సభ్యుల సమాచారం తెలుసుకొని వారికి సమాచారం అందించే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు.

యువతి ఎందుకు ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయనే విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు.