తెలుగు, హింది భాషల్లో పర్వర్ట్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నారు రాం గోపాల్ వర్మ. ఆయన అస్తమానం వివాదంలోకి ఎంటర్ అవడం సరదా... న్యూస్ లోఉన్న ప్రతివాడిని గిల్లుకోవడం, వాళ్లు ఆవేశపడి రెచ్చిపోతే  దానిపై క్రెడిట్ కొట్టేయడమే పనిగా పెట్టుకున్నారన్న విమర్శలున్నాయి. తాజాగా అరికాలుకు బోడిగుండుకు ముడిపెట్టే విషయాన్ని వెల్లడించారు. ఆ వివరాలేంటో కింద చదవండి.

రాం గోపాల్ వర్మ బుధవారం సాయంత్రం ఒక తెలుగు టివి చానెల్ లో‘గాడ్ సెక్స్ అండ్ ట్రూత్’  లైవ్ షోకు హాజరైండు. ఈ సినిమా  ఈనెల 26 విడుదలవుతూ ఉంది. ఆ కార్యక్రమంలో ఆయన తెలంగాణ సిఎం కేసిఆర్ తోపాటు.. సినిమా స్టార్ ఇలియానా మీద సెటైర్ వేశారు. అదేమంటే.. ఇలియానా కంటే కేసిఆర్ చాలా అందంగా ఉన్నారంటూ కామెంట్ చేశారు. దానికి ఆ టివి యాంకర్ అదేంటి సర్ ఇలియానా కంటే కేసిఆర్ అందంగా అంటున్నారు.. అలా ఎందుకు కంపేర్ చేస్తున్నారని ప్రశ్నించారు. దానికి మళ్లీ అదే మాటను రిపీట్ చేశాడు వర్మ. నేను చెప్పేది నిజమే అంటూ నొక్కి చెప్పారు.

అయితే గతంలోనూ ఇదే డైలాగ్ ను కేసిఆర్ మీద ప్రయోగించాడు వర్మ. అప్పట్లో తెలంగాణ వ్యతిరేకంగా ముద్ర పడ్డ వర్మపై తెలంగాణవాదులు ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అప్పటినుంచి కూడా వర్మ అనునిత్యం వివాదాల్లో ఉంటూ తన మనుగడ సాగిస్తున్నాడు. సినిమాలు తీసినా వివాదమే.. మాట్లాడినా వివాదమే ఉండడం వర్మ ప్రత్యేకతగా చెబుతారు. మొత్తానికి వర్మ అధ్యాయం ముగిసిపోతున్న దశలో మరోసారి వివాదాస్పద కామెంట్లు చేసి వార్తల్లో ఉండే ప్రయత్నం చేస్తున్నాడు వర్మ.