Asianet News TeluguAsianet News Telugu

ఏడాది తర్వాత విప్లవ కవి వరవరరావుకు బెయిల్: అయినా కూడా...

ప్రముఖ విప్లవ కవి వరవరరావుకు ముంబై కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఏడాది క్రితం ఎన్ఐఎ వరవరరావు కోరెగావ్ కుట్ర కేసులో అరెస్టు చేసింది. చివరకు ఆయనకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది.

Revolutionary poet Varavar Rao gets bail in Goregao conspiracy case
Author
Mumbai, First Published Feb 22, 2021, 11:32 AM IST

ముంబై: ప్రముఖ విప్లవ కవి వరవరరావుకు ముంబై కోర్టు బెయిల్ మంజూరు చేసింది. వివిగా ప్రఖ్యాతి వహించిన వరవరరావుకు కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఏడాది క్రితం గోరెగావ్ కుట్ర కేసులో ఎన్ఐఎ వరవరరావును అరెస్టు చేసింది. 

కొంత కాలంగా వరవరరావు అనారోగ్యంతో బాధపడుతున్నారు. ప్ఱధాని నరేంద్ర మోడీని హత్య చేసేందుకు కుట్ర చేశారనే ఆరోపణపై వరవరరావుతో పాటు మరికొంత మందిని ఎన్ఐఎ ఆరెస్టు చేసింది. ఏడాది తర్వాత వివికి బెయిల్ మంజురైంది. 

ఆరు నెలల పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉండానలోని కోర్టు వరవరరావును ఆదేశించింది. బెయిల్ ముంజూరు చేసినప్పటికీ ముంబై విడిచి వెళ్లరాదని కోర్టు ఆదేశించింది. ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని వరవరరావుకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది.

వరవరరావుకు కోర్టు మెడికల్ బెయిల్ మాత్రమే మంజూరు చేిసంది. ముంబైలోని స్పెషల్ ఎన్ఐఏ కోర్టు పరిధిలోనే ఉండాలని, గత ఎఫ్ఐఆర్ కు దారి తీసిన కార్యకలాపాలు చేయకూడదని కోర్టు ఆదేశించింది. కరోనా సోకడంతో పాటు తీవ్ర అనారోగ్యానికి గురి కావడంతో వరవరరావుకు బెయిల్ మంజూరు చేయాలని ఆయన భార్య హేమలత ఇటీవల హైకోర్టును ఆశ్రయించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios