కేసిఆర్ 24x7 కరెంటు వెనుక దొడ్డిదారి ముచ్చట గిదే

First Published 10, Jan 2018, 3:38 PM IST
Revanth reveals Indiabulls scam behind 24x7 power to farm sector
Highlights
  • నిరంతర కరెంటు పేరుతో జనంపై 7వేల కోట్ల భారం
  • ఇండియా బుల్స్ వారు కేసిఆర్ ను ప్రసన్నం చేసుకున్నారు
  • యాదాద్రి, భద్రాద్రి ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉంది
  • బిహెచ్ ఇఎల్ ద్వారా అయిన వారికి ఇచ్చుకున్నారు

మూడేళ్లలో 21వేల మెగావాట్లు ఉత్పత్తి సామర్ధ్యం తెస్తామని సీఎం అసెంబ్లీలో చెప్పారు. 2014 నవంబర్ 10న అసెంబ్లీలో సీఎం చేసిన ఈ ప్రకటనపై ఆ రోజే నేను స్పందించాను. 21వేల మెగావాట్లు కాదుగదా.. అందులో కనీసం 15 వేల మెగావాట్లు తెచ్చినా సన్మానం చేస్తానని చెప్పా. యాదాద్రి, భద్రాద్రి ప్రాజెక్టులు ఎక్కడవేసిన గొంగళి అక్కడే ఉన్నాయి. భద్రాద్రి ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వ సంస్థ కనుక బీహెచ్ఈఎల్ కు ఇచ్చామన్నారు. అనుమతులు లేకుండా పనులు ప్రారంభించినందుకు 23 మంది అధికారుల పై ఎన్జీటీ క్రిమినల్ కేసులు పెట్టింది.

ఇండియా బుల్స్ సంస్థకు మేలు చేసేందుకు నిషేధిత టెక్నాలజీతో తయారు చేసిన బాయిలర్లు కొన్నారు. రాష్ట్రం వచ్చాక ఇండియాబుల్స్ వాళ్లు కేసీఆర్ ను కలిసి ప్రసన్నం చేసుకున్నారు. దీంతో ఇండియాబుల్స్ లబ్ధి జరిగేలా బీహెచ్ఇఎల్ తో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఇండియాబుల్స్ సంస్థను కాపాడటం కోసం తెలంగాణ జెన్ కోను అడ్డంగా బలిచ్చారు. ఎప్పుడు సివిల్ వర్కులు చేయని బీహెచ్ఇల్ఎల్ కు భద్రాద్రిలో సివిల్ వర్క్ ఇచ్చారు. బీహెచ్ఇఎల్ ద్వారా దొడ్డిదారిన తమకు కావాల్సిన వారికి పనులిచ్చుకున్నారు. కేంద్రం నిషేధం విధించిన టెక్నాలజీని కొనాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వానికి ఎందుకు వచ్చింది?

విద్యుత్ ప్రాజెక్టుల పేరుతో రూ.లక్ష కోట్ల అప్పుచేయబోతున్నారు. ఈ రోజు విద్యుత్ ఉత్పత్తి ఎక్కువగా విమియోగదారులు తక్కువగా ఉన్నారు. ఈ రోజు రైతులపెరు మీద వేలకోట్ల అవినీతి జరుగుతున్నది. కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలంగాణ విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటు పై పునరాలోచించాలి అని చెప్పారు. ఇండియా బుల్స్  ని కాపాడేందుకు కేసీఆర్ తెలంగాణ ప్రజల నెత్తిన 7000 వేల  కోట్ల భారం మోపాడు. నిరంతర విద్యుత్ కేసీఆర్ వల్ల వచ్చింది కాదు. దేశంలోని కొన్ని సరళీకృత నిర్ణయాల వల్ల వచ్చింది.

విద్యుత్ మంత్రి జగదీష్ రెడ్డి ఒక చేత కాని చెంచా. చవట మంత్రి, దద్దమ్మ, అన్ని అబద్ధాలే చెప్తాడు. సబ్ క్రిటికల్ టెక్నాలజీ ని 13 వ పంచవర్ష ప్రణాళిక నిషేధించింది. కాంగ్రెస్ పార్టీ విద్యుత్ విషయంలో చర్చకు సిద్దం. ఈ రోజు విద్యుత్ సంస్థల్లో తక్కువ స్థాయి,వ్యక్తులను  ఉన్నత స్థానంలో కూర్చోబెడుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ విషయంలో శ్వేత పత్రం విడుదల చేయాలి.

loader