Revanth Reddy:రెండు రోజులుగా ఎమ్మెల్యేలతో హోటల్‌లోనే రేవంత్ రెడ్డి
హైద్రాబాద్ లోని హోటల్ లోనే నిన్నటి నుండి రేవంత్ రెడ్డి ఉన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో రేవంత్ రెడ్డి ఈ హోటల్‌లోనే ఉన్నారు.
హైదరాబాద్: నిన్నటి నుండి హైద్రాబాద్‌లోని హోటల్‌లో తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఉన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్కలు మంగళవారంనాడు న్యూఢిల్లీకి వెళ్లారు. కానీ రేవంత్ రెడ్డి మాత్రం హైద్రాబాద్‌లోని హోటల్ లోనే ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు కూడ అదే హోటల్ లో ఉన్నారు.
రేవంత్ రెడ్డి నివాసంతో పాటు హోటల్ లో రేవంత్ రెడ్డి ఉన్న గది వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పలువురు అధికారులు రేవంత్ రెడ్డిని కలిసి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. రేవంత్ రెడ్డి హోటల్ రూమ్ నుండే కాంగ్రెస్ నాయకత్వంతో సంప్రదింపులు జరుపుతున్నారు. పార్టీ నాయకత్వానికి తన అభిప్రాయాలను ఫోన్ ద్వారా చెబుతున్నారు.
also read:Uttam Kumar Reddy:కర్ణాటక డిప్యూటీ సీఎం డీ.కే.శివకుమార్ తో ఉత్తమ్ భేటీ, సీఎల్పీ నేత ఎంపికపై ఉత్కంఠ
హైద్రాబాద్‌లోని హోటల్ లో నిన్న మధ్యాహ్నం కాంగ్రెస్ పార్టీ శాసనసభపక్ష సమావేశం జరిగింది.ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు సీఎల్పీ నేత ఎంపిక బాధ్యతను అప్పగిస్తూ తీర్మానం చేశారు.ఈ తీర్మానం తర్వాత ఎమ్మెల్యేల వ్యక్తిగత అభిప్రాయాలను కర్ణాటక డిప్యూటీ సీఎం డీ. కే. శివకుమార్ తీసుకున్నారు. ఈ రిపోర్టును కూడ ఇవాళ మల్లికార్జున ఖర్గే నివాసంలో డీ. కే.శివకుమార్ అందించారు. ఖర్గే నివాసంలో జరిగిన సమావేశంలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, కే.సీ. వేణుగోపాల్, డీ.కే.శివకుమార్, మాణిక్ రావు ఠాక్రేలు పాల్గొన్నారు. ఖర్గే నివాసం నుండి సీల్డ్ కవర్ తో డీ. కే.శివకుమార్,మాణిక్ రావు ఠాక్రే హైద్రాబాద్ కు బయలు దేరారు.
also read:ఖర్గే నివాసంలో ముగిసిన భేటీ: రేవంత్ వైపే మొగ్గు, హైద్రాబాద్‌కు డీ.కే.శివకుమార్
నిన్న సీఎల్పీ సమావేశం కోసం హోటల్ కు వచ్చిన రేవంత్ రెడ్డి ఇంకా హోటల్ లోనే ఉన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడ ఇంకా హోటల్ లోనే ఉన్నారు. సీల్డ్ కవర్ లో ఉన్న పేరును మరోసారి కాంగ్రెస్ ఎమ్మెల్యేల సమావేశాన్ని ఏర్పాటు చేసి ప్రకటించనున్నారు. వీలైతే ఇవాళ రాత్రి లేదా రేపు ఉదయం కాంగ్రెస్ ఎమ్మెల్యేల సమావేశం ఏర్పాటు చేయనున్నారు.