Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణకు స్వాంతంత్య్రం తెచ్చింది కాంగ్రెస్సే.. స్వార్ద రాజకీయం కోసమే విమోచన వేడుకలు: రేవంత్

తెలంగాణకు స్వాంతంత్య్రం తెచ్చింది కాంగ్రెస్ పార్టీనేని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. ఇవాళ కొందరు చరిత్రను వక్రీకరించి రాజకీయ ప్రయోజనం పొందాలని చూస్తున్నారని మండిపడ్డారు.

Revanth Reddy Speech after unveils Telangana Talli statue at gandhi bhavan
Author
First Published Sep 17, 2022, 2:05 PM IST

తెలంగాణకు స్వాంతంత్య్రం తెచ్చింది కాంగ్రెస్ పార్టీనేని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. ఇవాళ కొందరు చరిత్రను వక్రీకరించి రాజకీయ ప్రయోజనం పొందాలని చూస్తున్నారని మండిపడ్డారు. గాంధీభవన్ లో నిర్వహించిన హైదరాబాద్ స్వాతంత్య్ర వేడుకల్లో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ తల్లి విగ్రహ నమూనాను ఆయన ఆవిష్కరించారు. పల్లెదనం, అమ్మలోని కమ్మదనం కలగలిసిన రూపం మన తెలంగాణ తల్లి అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే టీఎస్‌ను టీజీ చేస్తామని ప్రకటించారు. తెలంగాణ బిడ్డల ఆత్మగౌరవాన్ని ఆకాశానికి ఎగరే విధంగా జెండా రూపొందిస్తామని తెలిపారు. 

రాజులు, నవాబులకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ పోరాటం చేసిందన్నారు. కొందరు చరిత్రను దొంగిలించి రాజకీయ లబ్ది పొందాలని చూస్తున్నారని విమర్శించారు. స్వార్ద రాజకీయం కోసమే విమోచన వేడుకలని ఆరోపించారు. మతాలు, కులాల మధ్య చిచ్చు పెడుతున్నారని మండిపడ్డారు. ముస్లిం రాజులకు వ్యతిరేకంగా హిందువులు పోరాడినట్లు చరిత్రను వక్రీకరిస్తున్నారని రేవంత్  రెడ్డి అన్నారు. విద్వేషాలను రెచ్చగొట్టడానికి సెప్టెంబర్ 17ను ఉపయోగించుకుంటున్నారని మండిపడ్డారు. మరి ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాల సొంత రాష్ట్రం గుజరాత్‌లోని జునాఘడ్ కూడా 1948లోనే విలీనం అయిందని.. మరి అక్కడ ఎందుకు వజ్రోత్సవ విమోచన వేడుకలు చేయడం లేదని ప్రశ్నించారు. 

తెలంగాణలో మత కల్లోలాలు సృష్టించి ఇక్కడి పరిశ్రమలు గుజరాత్ తరలిపోవాలని బీజేపీ కుట్రలు చేస్తోందని ఆరోపించారు. ఎనిమిది ఏళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఈ వేడుకలను ఎందుకు చేయలేదన్నారు. ఎంఐఎంను భూతంగా చూపి తెలంగాణ అక్రమించడానికి బీజేపీ చిల్లర వేషాలు వేస్తున్నారని ఆరోపించారు. 1950లో గాంధీభవన్ కు పునాది వేసిందే సర్ధార్ వల్లాభాయ్ పటేల్ అని..అటువంటి నేతకు నివాళులు అర్పించడానికి బీజేపీ ఏం నైతిక హక్కు ఉందని ప్రశ్నించారు. అమిత్ షా సభకు 1500 మంది కూడా రాలేదని అన్నారు. చరిత్రలో బీజేపీ లేదు కాబట్టే ప్రజలు వారి సభకు రాలేదని అన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios