Asianet News TeluguAsianet News Telugu

ఫేక్ ఫార్టీ సోషల్ మీడియాలో బరితెగించింది.. బీజేపీపై తీవ్ర స్థాయిలో మండిపడ్డ రేవంత్ రెడ్డి..

మునుగోడు ఉప ఎన్నికవేళ కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతిపై సాగుతున్న ఫే‌క్ ప్రచారంపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దుబ్బాక తరహాలోనే మునుగోడులో ఫేక్ పార్టీ (బీజేపీ) సోషల్ మీడియాలో బరితెగించిందని విమర్శించారు.

Revanth Reddy Slams BJP for fake News on Palvai Sravanthi
Author
First Published Nov 3, 2022, 10:55 AM IST

మునుగోడు ఉప ఎన్నికవేళ కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతిపై సాగుతున్న ఫే‌క్ ప్రచారంపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దుబ్బాక తరహాలోనే మునుగోడులో ఫేక్ పార్టీ (బీజేపీ) సోషల్ మీడియాలో బరితెగించిందని విమర్శించారు. కాంగ్రెస్ అభ్యర్థి, మునుగోడు ఆడబిడ్డ పాల్పాయి స్రవంతిపై మార్పింగ్ ఫోటోలతో దుష్ఫ్రచారం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటమి ఖాయం అన్న భయం ఉన్న వాళ్లే ఇలాంటి నీచానికి దిగజారుతారని విమర్శించారు. ఈ మేరకు రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. 

మునుగోడు ఉపఎన్నిక పోలింగ్ వేళ సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారాలు వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్‌తో కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి భేటీ అయ్యారని కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అరగంట పాటు కేసీఆర్‌తో భేటీ అయ్యారని న్యూస్ చానల్‌లో కథనం వచ్చినట్టుగా ప్రచారాన్ని సాగించారు. 

 

ఈ క్రమంలోనే తనపై సాగుతున్న ప్రచారంపై పాల్వాయి స్రవంతి స్పందించారు. దమ్ము, ధైర్యం ఉంటే నేరుగా ఎదుర్కొవాలని.. ఇలా ఫేక్ ప్రచారాలు చేయడమేమిటని మండిపడ్డారు. ఈ పని చేసినవారిపై లీగల్‌గా యాక్షన్ తీసుకుంటానని చెప్పారు. తన తండ్రి వద్ద నుంచి నేర్చుకున్న నైతిక విలువలతో బుతుకుతున్నానని.. అవే విలువలతో మునుగోడులో పోరాడుతున్నానని చెప్పారు. ఇలాంటి ప్రచారాలతో తమ మనోధైర్యాన్ని దెబ్బతీయలేరని అన్నారు. ఇటువంటి వార్తలను తీవ్రంగా ఖండిస్తున్నట్టుగా చెప్పారు.  

ఇక, మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నిక పోలింగ్ ఈ రోజు ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. కాంగ్రెస్ అభ్యర్ధి పాల్వాయి స్రవంతి తన స్వగ్రామం.. చండూరు మండలం ఇడికుడలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇక, నారాయణపురం మండలం లింగవారిగూడెంలో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ జరగనుంది. మునుగో ఉప ఎన్నిక బరిలో మొత్తం 47 మంది అభ్యర్థులు నిలిచిన సంగతి తెలిసిందే. 

Follow Us:
Download App:
  • android
  • ios