Asianet News TeluguAsianet News Telugu

శశిథరూర్ పై కామెంట్స్.. వెనక్కి తగ్గిన రేవంత్ రెడ్డి

ఈ క్రమంలో థరూర్ కు రేవంత్ క్షమాపణలు తెలియజేశారు. తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లు గురువారం ట్విట్టర్ లో ప్రకటించారు

Revanth Reddy Seek apology Over The Comments on Sasi tharoor
Author
Hyderabad, First Published Sep 17, 2021, 7:39 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

కాంగ్రెస్ సీనియర్ నేథ శశిథరూర్ పై ఇటీవల పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. పార్లమెంటరీ ఐటీ స్థాయూ సంఘం ఛైర్మన్ హోదాలో ఈ మధ్య హైదరాబాద్ కు వచ్చిన శశి థరూర్ తెలంగాణ ప్రభుత్వాన్ని అభినందించారు.

కాగా.. ఈ విషయంలో రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. రేవంత్ పై విమర్శల వర్షం కురిపించారు. వీటిపై పత్రికల్లో వార్తలు కూడా వచ్చాయి. ఈ క్రమంలో థరూర్ కు రేవంత్ క్షమాపణలు తెలియజేశారు. తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లు గురువారం ట్విట్టర్ లో ప్రకటించారు.

థరూర్ ఆ ట్వీట్ కి స్పందించడం గమనార్హం. ఈ వివాదానికి ముగింపు పలుకుదామన్నారు.  మనమంతా కలిసి దేశంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ ని బలోపేతం చేద్దామని థరూర్ పేర్కొన్నారు.

ఇదిలా ఉండగా.. సహచర ఎంపీ అయిన పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి థరూర్ పై అవమానకరంగా చిల్లర వ్యాఖ్యలు  చేయడం దారుణమని మంత్రి కేటీఆర్ గురువారం ట్విట్టర్ లో పేర్కొన్నారు.  నేర చరిత్ర, స్వభావం ఉన్నవారు పార్టీకి న్యాయకత్వం వహిస్తే ఇలానే ఉంటుందని అన్నారు. థరూర్ పై రేవంత్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన ఆడియోను ట్విట్టర్ లో ఉంచారు. దీన్ని ఫోరెన్సిక్ విభాగానికి పంపిస్తే ఓటుకు నోటు కేసులో ఉన్న రేవంత్ గొంతుతో కచ్చితంగా సరిపోతుందన్నారు

Follow Us:
Download App:
  • android
  • ios