తెలంగాణ మంత్రి కేటి రామారావు తమ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెసు నేత రేవంత్ రెడ్డి ట్విట్టర్ లో స్పందించారు.

హైదరాబాద్‌: తెలంగాణ మంత్రి కేటి రామారావు తమ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెసు నేత రేవంత్ రెడ్డి ట్విట్టర్ లో స్పందించారు. "మీరు మరీనూ రావు గారూ.. కుటుంబం మొత్తం కాళ్లపైన పడినప్పుడు తెలీదా?" అని రేవంత్ రెడ్డి మంత్రి కేటీఆర్‌ను అడిగారు. 

రాహుల్‌గాంధీని ఉద్దేశించి కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలపై ఆయన ఆ విధంగా స్పందించారు. విభజన బిల్లు ఆమోదం తర్వాత కుటుంబ సమేతంగా సోనియాను కేసీఆర్‌ కలిసినప్పటి ఫొటోను ఆయన ట్వీట్‌కు జత చేశారు.

Scroll to load tweet…