Revanth Reddy:రాజ్యాంగాన్ని రద్దు చేసి కొత్తగా రాజ్యాంగం రాయలని కేసీఆర్ చేసిన వ్యాఖ్య‌లు దేశద్రోహం కిందకు వస్తాయ‌ని,  ముఖ్యమంత్రి కేసీఆర్ మీద దేశద్రోహం కేసు పెట్టాలని ఫిర్యాదులో పేర్కొన్నారు రేవంత్ రెడ్డి. 

Revanth Reddy: కేంద్ర బడ్జెట్‌పై మాట్లాడుతూ.. భార‌త రాజ్యాంగంపై సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్య‌లు తెలంగాణ రాజకీయాల్లో హీట్ పుట్టిస్తున్నాయి. కేసీఆర్ తీరును త‌ప్పుబడుతూ ద‌ళిత సంఘాలు, ప్ర‌తిప‌క్షాలు రచ్చరచ్చ చేస్తున్నాయి. మ‌రోవైపు.. కేసీఆర్‌ వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ, కాంగ్రెస్‌లు ధర్నాలు, దీక్ష‌లు, ఆందోళనతో హోరెత్తిస్తున్నాయి. ఓ వైపు.. కేసీఆర్‌ వ్యాఖ్యల‌ను టీఆర్‌ఎస్‌ సమర్థించుకుంటోంది. మ‌రోవైపు .. విపక్షాలు మాత్రం మండిపడుతున్నాయి. దేశ ప్ర‌జ‌ల‌కు సారీ చెప్పాల్సిందేన‌ని డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేప‌థ్యంలోనే రాష్ట్ర‌వ్యాప్తంగా పోలీస్ స్టేష‌న్ల‌లో ఫిర్యాదుల కార్య‌క్ర‌మానికి పిలుపునిచ్చింది కాంగ్రెస్‌.

రాజ్యాంగాన్ని మార్చాలన్న కేసీఆర్‌ వ్యాఖ్యల వెనుక పెద్ద కుట్ర ఉందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆరోపించారు. కేసీఆర్ పై పోలీసుల‌కు రేవంత్ రెడ్డి ఫిర్యాదు చేశారు. రాజ్యాంగంపై సీఎం వ్యాఖ్యలపై అభ్యంత‌రమ‌ని గజ్వేల్ పోలీస్ స్టేషన్ సీఎం కేసీఆర్ పై ఫిర్యాదు చేశారు. ఇప్పుడున్న భారత రాజ్యాంగంతో గడిచిన 75 సంత్సరాలలో ప్రజల ఆశయాలు, ఆకాంక్షలు నెరవేరడం లేదన్న‌ సీఎం కామెంట్స్ ను పోలీసుల‌కు వివ‌రించారు.

రాజ్యాంగాన్ని రద్దు చేసి కొత్తగా రాజ్యాంగం రాయలని కేసీఆర్ చేసిన వ్యాఖ్య‌లు దేశద్రోహం కిందకు వస్తాయ‌ని, ముఖ్యమంత్రి కేసీఆర్ మీద దేశద్రోహం కేసు పెట్టాలని ఫిర్యాదులో పేర్కొన్నారు రేవంత్ రెడ్డి. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లే కేసీఆర్ ఫ్యామిలీ రాజ్యాంగ బద్ధంగా పదవులు అనుభవిస్తోందని, ప్రజలు కూడా ఆయన ఎన్ని ఆస్తులు కూడబెట్టుకున్నా ప్రజాస్వామ్యబద్ధంగా ఓడించాలని చూస్తున్నారే తప్ప మూకుమ్మడిగా ఎదురుతిరగడం లేదన్నారు. అనంత‌రం పోలీస్ స్టేషన్ లో సీఐ వీరప్రసాద్ కు భారత రాజ్యాంగాన్ని అందజేశారు 

హైదరాబాద్‌లో ప్రధాని మోడీ పర్యటన కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు గాను ఆయన మీద కేసు పెట్టాల్సిందిగా సిద్దిపేట జిల్లా గజ్వేల్ పోలీస్ స్టేషన్లో రేవంత్ ఫిర్యాదు చేశారు. ఈ విషయంలో రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ యంత్రాంగం ఫిర్యాదులు చేస్తుందని చెప్పారు. ఈ త‌రుణంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లలో కేసీఆర్ పై ఫిర్యాదు చేయాల‌ని కాంగ్రెస్ నేత‌లకు పిలుపునిచ్చారు. ఆదివారం అంబేద్క‌ర్ విగ్ర‌హాలకు పాలాభిషేకాలు నిర్వ‌హించాల‌ని తెలిపారు.