హైదరాబాద్‌,: హైదరాబాదులో శనివారం సాయంత్రం జరిగిన బహిరంగ సభకు కాంగ్రెసు తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి హాజరు కాకపోవడం చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెసులో చేరిన తర్వాత రాహుల్‌గాంధీ సభల్లో ఆయన ముందు వరుసలో ఉంటూ వచ్చారు. 

శనివారం జరిగిన రాహుల్ గాంధీ పాల్గొన్న శంషాబాద్‌ సభలో రేవంత్ రెడ్డి కనిపించలేదు. ఆయన హైదరాబాద్‌లోనే ఉన్నప్పటికీ సభకు రాలేదని నాయకుల మాటలను బట్టి అర్థమైంది. స్వాగత ఉపన్యాసంలో భాగంగా మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి నేతలను స్వాగతం చెప్పారు. ఈ సందర్భంగా ఆమె రేవంత్‌రెడ్డి పేరును కూడా ప్రస్తావించారు. 

సభకు ముగ్గురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు కూడా గైర్హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)లో చేరడానికి సిద్ధపడిన రేగా కాంతా రావు, ఆత్రం సక్కు, చిరుమర్తి లింగయ్య గైర్హాజయ్యారు. మిగతా ఎమ్మెల్యేలంతా సభకు హాజరయ్యారు.