టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి గురువారం కొండగల్ నుంచి పోటీచేయడానికి దరఖాస్తు సమర్పించనున్నారు. తాను కొడంగల్ నుంచి పోటీ చేయనున్నట్లు ప్రకటించారు.
హైదరాబాద్ : తాను కొడంతల్ నుంచే పోటీ చేయబోతున్నానని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. గురువారం నాడు ఈ మేరకు దరఖాస్తు చేయనున్నట్లు ప్రకటించారు. తన తరఫున కొడంగల్ లోని స్థానిక నేతలు దరఖాస్తు చేస్తారని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ అధిష్టానం సోనియా గాంధీ ఆదేశాల మేరకు నేను ఇక్కడ ఉండే.. కొడంగల్ లో కార్యకర్తల ద్వారా దరఖాస్తును ఇవ్వబోతున్నాం.
సోనియాగాంధీ ఆదేశాల మేరకే ఇది జరుగుతోంది. కొడంగల్ అభివృద్దే లక్ష్యంగా అక్కడినుంచే పోటీకి దిగాలని ఆదేశించారని తెలిపారు. కాంగ్రెస్ లో టీపీసీసీ చీఫ్ అయినా.. సామాన్య కార్యకర్త అయినా సరే పోటీ చేయాలంటే దరఖాస్తు చేసుకోవాల్సిందే. ఈ క్రమంలోనే తాను ఈ రోజు దరఖాస్తు చేయబోతున్నట్లు రేవంత్ రెడ్డి ప్రకటించారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
