Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణలో కాంగ్రెస్‌ను అధికారంలోకి తెస్తా: టీపీసీసీ చీఫ్‌ రేవంత్ రెడ్డి

టీపీసీసీ చీఫ్‌గా ఎంపికైన తర్వాత రేవంత్ రెడ్డి స్పందించారు. సోనియా, రాహుల్ గాంధీ ఆలోచన మేరకు పనిచేస్తానని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణలో కాంగ్రెస్‌ను తిరిగి అధికారంలోకి తీసుకొస్తానని రేవంత్ పేర్కొన్నారు.

revanth reddy comments after appointment of tpcc chief ksp
Author
Hyderabad, First Published Jun 26, 2021, 10:04 PM IST

టీపీసీసీ చీఫ్‌గా ఎంపికైన తర్వాత రేవంత్ రెడ్డి స్పందించారు. సోనియా, రాహుల్ గాంధీ ఆలోచన మేరకు పనిచేస్తానని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణలో కాంగ్రెస్‌ను తిరిగి అధికారంలోకి తీసుకొస్తానని రేవంత్ పేర్కొన్నారు. బడుగు, బలహీన వర్గాల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. అమరవీరుల ఆశయాల కోసం పనిచేస్తానన్నారు. 

 

 

టీపీసీసీ ప్రెసిడెంట్‌గా రేవంత్ రెడ్డిని నియమించడంతో తెలంగాణ కాంగ్రెస్‌లో కల్లోలం రేగింది. రేవంత్ నియామకాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ నేత కిచ్చన్నరెడ్డి లక్ష్మారెడ్డి పార్టీకి రాజీనామా చేశారు. ఒక పక్కన రేవంత్ వర్గం సంబరాలు చేసుకుంటుంటే.. మరోవైపు అసంతృప్త నేతలు రాజీనామా బాట పడుతూ వున్నారు. 

కాంగ్రెస్‌లో గ్రూప్ రాజకీయాలు కొత్తేమీ కాదు. అలాంటిది ఇప్పుడు రేవంత్‌రెడ్డి పార్టీ పగ్గాలు అప్పగించిన నేపథ్యంలో.. పార్టీలో ఆయనను వ్యతిరేకిస్తున్నవారు తర్వాత కాలంలో కలిసి పనిచేయక తప్పదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రేవంత్ రెడ్డి వ్యతిరేకులు.. పార్టీ అధిష్టానం తీసుకున్న నిర్ణయాన్ని గౌరవించి ఆయనతోతో కలిసి పనిచేస్తారా.. లేక పార్టీలో గ్రూప్ రాజకీయాలు తారాస్థాయికి చేరతాయా తెలియాలంటే మరికొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే

 

Follow Us:
Download App:
  • android
  • ios