టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, కొడంగల్ కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో కొడంగల్‌లోని ఆయన నివాసంలోకి బలవంతంగా ప్రవేశించిన పోలీసులు గేటు తాళాలు పగలగొట్టి ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. రేవంత్‌రెడ్డితో పాటు అతని సోదరులు, వాచ్‌మెన్, గన్‌మెన్లను కూడా అరెస్ట్ చేశారు. ప్రస్తుతం కొడంగల్‌లో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. దీంతో పోలీసులు 144 సెక్షన్‌‌ను విధించారు. 

"