కేసీఆర్ కు సవాల్ : రేవంత్ రెడ్డి అరెస్ట్.. గన్ పార్క్ దగ్గర ఉద్రిక్తత...
గన్ పార్క్ దగ్గర టీపీసీసీ చైర్మన్ రేవంత్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. అక్కడినుంచి గాంధీభవన్ కు తరలించారు.
హైదరాబాద్ : హైదరాబాద్ గన్ పార్క్ దగ్గరున్న అమరవీరుల స్తూపం దగ్గర ఉద్రిక్తత నెలకొంది. టీపీసీసీ నేత రేవంత్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ నేతలు పెద్ద ఎత్తున గన్ పార్క్ కు చేరుకున్నారు. దీంతో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో ఇలాంటి వాటికి అనుమతి లేదంటూ పోలీసులు రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేశారు.
పోలీసులు తనను అరెస్ట్ చేయడానికి రావడంతో రేవంత్ రెడ్డి రోడ్డుపై బైఠాయించారు. పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పోలీసులు రేవంత్ రెడ్డిని అదుపులోకి తీసుకుని గాంధీభవన్ కు తరలించారు. మిగతా కాంగ్రెస్ నేతలను కూడా అరెస్టులు చేస్తున్నారు. రెండు రోజుల క్రితం సీఎం రేవంత్ రెడ్డి సీఎం కేసీఆర్ కు సవాల్ విసిరారు.
తెలంగాణపై స్పష్టమైన విజన్ లేని పార్టీ.. : కాంగ్రెస్ పై మంత్రి కేటీఆర్ ఫైర్
ఈ ఎన్నికల్లో నగదు, మద్యం పంచకుండా ఎన్నికలకు వెడదామని.. అమరవీరుల స్తూపం సాక్షిగా ప్రమాణం చేద్దాం రావాలంటూ తెలిపారు. 17వ తేదీన మధ్యాహ్నం 12 గం.లకు తాను గన్ పార్క్ దగ్గరికి వస్తానని, కేసీఆర్ కూడా రావాలని తెలిపారు.
గతవారంలో కర్నాటకలో పట్టుబడ్డ రూ.40కోట్ల పై చిలుకు నగదు కొడంగల్ కు చేరాల్సినవేనని కేసీఆర్ ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఈ మేరకు రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. దీనిమీద ఆ రోజు సాయంత్రమే కేటీఆర్ స్పందించారు. ఓటుకు నోటు కేసులో రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ ఆయనా ఎన్నికల్లో డబ్బులు, మద్యం గురించి మాట్లాడేదంటూ ఎద్దేవా చేశారు.