తెలంగాణ సిఎం తనయుడు, ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కేటిఆర్ మీద మరోసారి విరుచుకుపడ్డారు కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి. పప్పు అని గూగుల్ లో టైప్ చేస్తే రాహుల్ గాంధీ ఫొటోలు దర్శనమిస్తాయని కేటిఆర్ చేసిన వ్యాఖ్యలను రేవంత్ వద్ద ప్రస్తావించగా ఘాటుగా రియాక్ట్ అయ్యారు. అమెరికా బాత్ రూములు.. కేటిఆర్ అంటూ తీవ్రమైన దూషణలు చేశారు.

అంతేకాదు.. తెలంగాణలో కేటిఆర్ కు మంత్రి పదవికే కాదు.. కనీసం చెప్రాసి నౌకరి చేయడానికి కూడా అర్హత లేని వ్యక్తి అని ఎద్దేవా చేశారు. అలాంటి కేటిఆర్ మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. ఇంకా కేటిఆర్ మీద రేవంత్ ఏమన్నారో కింద వీడియోలో చూడండి.