రైతు సమితికి రేవంత్ పెట్టిన కొత్త పేరు ఇదే

revanth commetns on rytu samithi
Highlights

  • తెలంగాణ సర్కారు తెచ్చిన రైతు సమితికి కొత్త పేరు పెట్టిన రేవంత్
  • రైతు సమితి లపై పరుషంగా విమర్శలు

తెలంగాణ సర్కారు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని చేపడుతున్న రైతు సమితిల ఏర్పాటుపై సర్వత్రా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ రైతు సమితిలు తీసుకురావడం పట్ల అన్ని రాజకీయ పార్టీలు విమర్శిస్తున్నాయి. రైతు సమితిలు నిజాం కాలం నాటి రజాకార్ల సైన్యం లాంటివే అని మండిపడుతున్నారు ప్రతిపక్ష నేతలు. కాంగ్రెస్, టిడిపి, బిజెపి, లెప్ట్ పార్టీలతోపాటు తెలంగాణ జెఎసి కూడా రైతు సమితిల ఏర్పాటును వ్యతిరేకిస్తూ ఆందోళనలు చేస్తున్నాయి. తక్షణమే జిఓ 39 రద్దు చేయాలని డిమాండ్ చేశాయి.

ఇక సర్కారు మాత్రం దూకుడుగా వెళ్తోంది. రైతు సమితిల ద్వారా వ్యవసాయ విప్లవం సాధించే అవకాశముందని సిఎం, మంత్రులు చెబుతున్నారు. ఇప్పటికే రైతు సంఘాల నిర్మాణంపై ప్రభుత్వం, టిఆర్ఎస్ పార్టీ రంగంలోకి దిగాయి. 

కానీ ప్రతిపక్షాలు దీనిపై చేయాల్సిన ఆందోళనలు చేసి తర్వాత కోర్టుకు వెళ్లే యోచన చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో రైతు సమితిల పై టిడిపి తెలంగాణ వర్కింగ్ ప్రసిడెంట్ రేవంత్ రెడ్డి తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. రాష్ట్ర రైతు సమితి అంటే ఆర్.ఎస్.ఎస్. అని నామకరణం చేశారు రేవంత్.

మరి ఇప్పటికే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అనేది జాతీయ స్థాయిలో పాపులర్ సంస్థ ఉండనే ఉంది. మరి తెలంగాణ సర్కారు చేపట్టిన రైతు సమితి కి రేవంత్ ఆర్ఎస్ఎస్ అని నామకరణం చేయడం ఎందుకబ్బా అని రాజకీయాల్లో జోరుగా చర్చలు జరుగుతున్నాయి.

ఆర్ఎస్ఎస్ అనడంతోపాటు రజాకార్ల సమితి అని కూడా పరుషంగా మాట్లాడారు రేవంత్. అన్నిటికంటే ఆర్ఎస్ఎస్ అనే మాట రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. 

 

loader