రోడ్డు ప్రమాదంలో రిటైర్డ్ ఎస్‌ఐ పాడి రెజిరెడ్డి దుర్మరణం..

రోడ్డు ప్రమాదాలు ఎంతోమందిని అర్థాయుష్కులుగా చేస్తున్నాయి. ఎన్నో ప్రాణాల్ని బలితీసుకుంటున్నాయి. తాజాగా కరీంనగర్ జిల్లాలో గురువారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ రిటైర్డ్ ఎస్సై మృత్యువాత పడ్డాడు.

Retired SI Padi Rejireddy killed in road accident at Huzurabad

హుజురాబాద్ : karimnagar జిల్లాలో గురువారం తెల్లవారు జామున జరిగిన రోడ్డు ప్రమాదంలో రిటైర్డ్ ఎస్‌ఐ పాడి రెజిరెడ్డి దుర్మరణం చెందారు. కరీంనగర్‌లోని గోదాంగడ్డలో నివాసం ఉంటున్న Padi Rejireddyవరంగల్ జిల్లా నడికుడ మండలం నరసక్కపల్లి నివాసి. గురువారం తెల్లవారు జామున తన సొంతూరుకు టీఎస్ 02, ఎఫ్ బి, 4556 నెంబర్ carలో వెళ్తుండగా హుజురాబాద్ పట్టణ సమీపంలో చెట్టుకు ఢీ కొనడంతో మృత్యువాత పడ్డారు. నక్సల్స్ ఏరివేతలో భాగంగా కొంతకాలం ఎస్ ఐబీలో కూడా పనిచేసిన రాజిరెడ్డి, కరీంనగర్ ఉమ్మడి జిల్లా పోలీసు అధికారుల సంక్షేమ సంఘం అధ్యక్షునిగా వ్యవహరించారు. ఆయన కూతురు వివాహం అయి అమెరికాలో స్థిరపడ్డారు. హుజురాబాద్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు

ఇక, మద్యం మత్తులో మందుబాబులు వీరంగం సృష్టిస్తున్నారు. Jagtial District కేంద్రంలోని కలెక్టరేట్ సమీపంలో ఓ కారు బుధవారం బీభత్సం సృష్టించింది. మద్యం మత్తులో మోహన్ అనే యువకుడు కారు నడపడంతో ప్రమాదం చోటు చేసుకుంది. 
Divider ను ఢీ కొట్టిన కారు... parking చేసిన వాహనాలపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో 9 ద్విచక్రవాహనాలు ధ్వంసమయ్యాయి. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

మార్చి 21న కృష్ణా జిల్లాలోనూ ఇలాంటి దారుణమే జరిగింది. కృష్ణా జిల్లాలో నూజివీడులో మద్యం మత్తులో బస్సును నడుపుతున్న డ్రైవర్ ను ప్రయాణికులు పోలీసులకు పట్టించారు. ఫూటుగా మద్యం సేవించి తన ప్రాణాలనే కాదు ప్రయాణికుల ప్రాణాలను రిస్క్ లో పెట్టి ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును ప్రయాణికుల సమాచారంతో పోలీసులు అడ్డుకున్నారు.  ప్రయాణికులను ఎక్కించుకుని సోమవారం ఉదయం విస్సన్నపేట నుండి హైదరాబాద్ కు ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బయలుదేరింది. 

ఇదిలా ఉండగా, మార్చి 2న తెలంగాణ రాజధాని హైదరాబాద్  శివారులోని మేడ్చల్ జిల్లాలో మంగళవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తొమ్మిదిమంది వలసకూలీలు ప్రయాణిస్తున్న కారు అతివేగంగా వెళుతూ అదుపుతప్పి రోడ్డుమధ్యలో వుండే డివైడర్ ను ఢీకొట్టింది. దీంతో ఇద్దరు మృతిచెందగా మిగతా ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. 

వివరాల్లోకి వెళితే... మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన కొందరు బ్రతుకుదెరువు కోసం తెలంగాణకు వసలవచ్చారు. వీరు హైదరాబాద్ తో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో కూలీ పనులు చేసుకుంటే కుటుంబాలను పోషించుకునేవారు. అయితే వీరిలో కొందరు రామాయంపేటలో పని వుండటంతో ఇటీవలే అక్కడికి వెళ్లారు. అక్కడ పనులు ముగించుకుని తిరిగి హైదరాబాద్ కు కారులో బయలుదేరారు. ఈ క్రమంలోనే వీరు ప్రయాణిస్తున్న కారు నగర శివారులోని మేడ్చల్ చెక్ పోస్ట్ వద్దకు రాగానే అదుపుతప్పి ప్రమాదానికి గురయ్యింది. 

డ్రైవర్ మద్యంమత్తులో కారు నడపడంతో ప్రమాదం చోటుచేసుకుంది. అతివేగంతో వెళుతున్న కారు మేడ్చల్ చెక్ పోస్ట్ వద్ద అదుపుతప్పి బావర్చి హోటల్ ఎదురుగా డివైడర్ కు డీకొట్టింది. ప్రమాద సమయంలో  కారులో తొమ్మిదిమంది వుండగా తీవ్రంగా గాయపడి గోరీ సింగ్, బబ్లీ సింగ్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మిగతా ఏడుగురికి కూడా తీవ్రగాయాలపాలయ్యారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను గాంధీ హాస్పిటల్ కు తరలించారు. అనంతరం రెండు మృతదేహాలను కూడా పోస్టు మార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రులకు తరలించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.  

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios