హైదరాబాద్‌ గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్ పరిధిలోని కొండాపూర్‌లో రిటైర్డ్ ఆర్ఎస్ఐ ఆంజనేయరెడ్డి  తన భార్యను గొంతుకోసి  దారుణంగా హత్య చేశాడు.  ఆ తర్వాత ఆయన పోలీసులకు లొంగిపోయాడు. 


హైదరాబాద్: హైదరాబాద్‌ గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్ పరిధిలోని కొండాపూర్‌లో రిటైర్డ్ ఆర్ఎస్ఐ ఆంజనేయరెడ్డి తన భార్యను గొంతుకోసి దారుణంగా హత్య చేశాడు. ఆ తర్వాత ఆయన పోలీసులకు లొంగిపోయాడు. 

కుటుంబ కలహాల కారణంగానే అంజయ్య తన భార్యను హత్య చేశాడు. ఆ తర్వాత పోలీసులకు లొంగిపోయాడు. ఆంజనేయరెడ్డి గతంలో కొండాపూర్ బెటాలియన్‌లో పనిచేశాడు. కొడవలితో భార్య గొంతును అతి దారుణంగా కోసి హత్య చేశాడు. 

ఆంజనేయరెడ్డికి భార్యకు మధ్య గత కొంతకాలంగా గొడవలు చోటుచేసుకొంటున్నాయి. ఈ గొడవల కారణంగానే ఆంజనేయరెడ్డి ఆదివారం నాడు రాత్రిపూట భార్యను కొడవలితో గొంతుకోసి చంపేశాడు.

సంఘటనాస్థలాన్ని కొండాపూర్ పోలీసులు పరిశీలించారు. ఆంజనేయరెడ్డి ఎందుకు ఈ హత్య చేయాల్సి వచ్చిందనే విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు.