కరోనా వైరస్ సోకడం కంటే అది తమకు అంటిందన్న భయంతో చనిపోయే వారి సంఖ్య ఈ మధ్యకాలంలో పెరుగుతోంది. తాజాగా కోవిడ్ సోకిందన్న భయంతో రిటైర్డ్ జడ్జి ఆత్మహత్యకు పాల్పడ్డారు.

హైదరాబాద్ మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. మియాపూర్ న్యూ సైబర్ హిల్స్‌లో ఉంటున్న రిటైర్డ్ న్యాయమూర్తి రామచంద్రారెడ్డి శుక్రవారం తన బెడ్‌రూమ్ సిలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు.

తన వల్ల కుటుంబసభ్యులకు కరోనా సోకకూడదనే ఉద్దేశంతోనే ఆత్మహత్యకు పాల్పడుతున్నట్టు ఆయన సూసైడ్ నోట్ రాశారు. మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.