హైదరాబాద్‌లో (hyderabad) దారుణం చోటు చేసుకుంది. మిగిలిపోయిన బిర్యానీ (biryani) కోసం ఓ కూలీ రెస్టారెంట్ కి వెళ్ళాడు. అతడిని దొంగగా భావించిన రెస్టారెంట్ సిబ్బంది దాడి చేయడంతో తీవ్ర గాయాలపాలై ప్రాణాలు కోల్పోయాడు.

హైదరాబాద్‌లో (hyderabad) దారుణం చోటు చేసుకుంది. మిగిలిపోయిన బిర్యానీ (biryani) కోసం ఓ కూలీ రెస్టారెంట్ కి వెళ్ళాడు. అతడిని దొంగగా భావించిన రెస్టారెంట్ సిబ్బంది దాడి చేయడంతో తీవ్ర గాయాలపాలై ప్రాణాలు కోల్పోయాడు. వివరాల్లోకి వెళితే.. ఒడిశాకు చెందిన రాజేష్‌ (rajesh) అనే కార్మికుడు భార్య, పిల్లలతో కలిసి మాదాపుర్‌లో ఉంటూ ప్రగతినగర్‌లో భవన నిర్మాణ సెంట్రింగ్ కార్మికుడిగా పని చేస్తున్నాడు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

బుధవారం అర్ధరాత్రి సమయంలో పని ముగించుకొని ఇంటికి వెళ్లే సమయంలో జేఎన్‌టీయూహెచ్‌ (jntuh) మెట్రో స్టేషన్‌ పక్కనే ఉన్న మొఘల్స్‌ ప్యారడైజ్‌ (mughals paradise) రెస్టారెంట్‌ దగ్గరకు వెళ్లాడు. రెస్టారెంట్ సెల్లార్లోకి వెళ్లి మిగిలిపోయిన బిర్యానీ ఏరుకుంటున్నాడు. అతడిని గమనించిన సిబ్బంది దొంగగా భావించి దాడి చేశారు.

ఈ ఘటనలో అతడికి తీవ్ర గాయాలు కావడంతో రాజేశ్ అక్కడే పడిపోయాడు.. కిందపడిన వ్యక్తిని మానవత్వం లేకుండా అక్కడే వదిలేసి వెళ్లారు సిబ్బంది. గురువారం ఉదయం వచ్చి చూసేసరికి అతడు అక్కడే పడి వున్నాడు. దీంతో రాజేష్ తండ్రికి సమాచారం ఇచ్చారు రెస్టారెంట్ సిబ్బంది. అతడు రాజేష్ భార్యకు విషయం చెప్పడంతో ఆమె వచ్చి భర్తను ఇంటికి తీసుకెళ్లింది. అయితే ఆ కాసేపటికే అతడు మృతి చెందడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.