వచ్చే నెలలో జర్నలిస్టులు ఇళ్ల జాగలకు లైన్ క్లీయర్ చేయబోతున్నట్టు స్పష్టం చేసారు తెలంగాణ సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటి నుంచి జర్నలిస్టులకు ఇళ్లస్థలాల ప్రస్తావన కొనసాగుతూనే ఉంది. స్వయంగా సీఎం కేసీఆరే ఇస్తానని అన్నారు. గత ఎన్నికలకు ముందే ఇంటి జాగాలు దక్కుతాయి అని అంతా భావించినప్పటికీ... అది జరగలేదు. నిన్న సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ .. వచ్చే నెలలో జర్నలిస్టులు ఇళ్ల జాగలకు లైన్ క్లీయర్ చేయబోతున్నట్టు స్పష్టం చేసారు. సుప్రీంకోర్టులో కేసు ముగుస్తుందని, సోసైటీలలకు... కొత్త చట్టం తెస్తామని స్పష్టం చేసారు. ఎమ్మెల్యేలకు, జర్నలిస్టులకు జాగలు తప్పుకుంట ఇచ్చే బాధ్యత తనదే అని సీఎం కేసీఆర్ మరోమారు పునరుద్ఘాటించారు. భూములు మస్తుగ ఉన్నాయని ఎవరికి దాని గురించి సంశయం అవసరం లేదని స్పష్టం చేసారు.
ఇక నిన్న ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ పై సీఎం కేసీఆర్ ఒక రేంజ్ లో విరుచుకుపడ్డారు. దిశ, దశ, నిర్దేశం లేని పనికిమాలిన.. పసలేని బడ్జెట్ అని విరుచుకుపడ్డారు. కేంద్ర బడ్జెట్‌లో మాటల గారడీ తప్ప ఏమీ లేదని, ఇది చాలా దారుణమైన బడ్జెట్ అని మండిపడ్డారు. సామాన్యులను నిరాశ, నిస్పృహకు గురిచేసిందన్నారు. దేశ ప్రజల్ని ఘోరంగా అవమనించారని, బడ్జెట్‌లో పేదలకు గుండుసున్నా అని విమర్శించారు. మసిపూసి మారేడుకాయ చేసిన గోల్‌మాల్ బడ్జెట్ అని ఎద్దేవా చేశారు. వ్యవసాయ రంగాన్ని ఆదుకునే చర్యలు శూన్యమని, దేశ చేనేత రంగానికి బడ్జెట్‌లో చేసిందేం లేదని దుయ్యబట్టారు.
‘మహాభారతంలోని శాంతి పర్వం శ్లోకం చెప్పి బడ్జెట్ ప్రసంగం ప్రారంభించారు. ధర్మ సందేశం ఇచ్చిన తర్వాత ఈ శ్లోకం చెప్తారు. శాంతి పర్వంలో శ్లోకం చెప్పి.. అధర్మం, అసత్యం గురించి మాట్లాడారు. దేశ ప్రజలను వంచించారు. కేంద్ర మంత్రి తనను తాను ఆత్మవంచన చేసుకున్నారు. ఇది గోల్‌మాల్ గోవిందం బడ్జెట్‌లా ఉంది. దేశంలో ఇంత పెద్ద రైతు ఉద్యమం జరిగింది. అయినా వ్యవసాయ రంగ అభివృద్ధికి నిధుల కేటాయింపు లేదు. ఎరువుల మీద 35వేల కోట్ల రూపాయల సబ్సిడీని తగ్గించారు. గ్రామీణ ఉపాధి హామీ పథకానికి నిధుల కొత పెట్టారు.
ఎస్టీ, ఎస్సీ జనాభా పెరిగింది. ఈ రెండు వర్గాలకు బడ్జెట్‌లో రూ. 12,800 కోట్లు కేటాయించారు ఇంత కంటే దరిద్రం మరోటి ఉండదు. దళిత, గిరిజనులకు కేంద్ర బడ్జెట్ వేసిన అంచనా.. ఒక రాష్ట్రం పెట్టినంత కాదు. దేశంలో ఇంత పెద్ద రైతు ఉద్యమం జరిగింది. అయినా వ్యవసాయ రంగ అభివృద్ధికి నిధుల కేటాయింపు లేదు. బడ్జెట్‌లో పేదలకు దక్కింది సున్నా.
సోషల్ మీడియా మాయలో మోదీ పరిపాలిస్తున్నాడు. గుజరాత్ మోడల్ పేరుతో దేశ ప్రజలను మోసం చేశారు. గుజరాత్ మోడల్ అంటే పైన పటారం ,లోన లోటారం. కేంద్ర బడ్జెట్‌లో హెల్త్‌కు ఒక్క రూపాయి పెంచలేదు. బడ్జెట్ ఎవరికోసం పెట్టారు. రైతుల ఆదాయం రెట్టింపు అని చెప్పి పెట్టుబడి రెట్టింపు చేశారు. అందరికీ ఇళ్ళు అనేది పచ్చి బోగస్. ప్రతీ ఒక్కరి ఖాతాలో 15 లక్షలు అన్నారు. ఏమైంది?.
ఆకలి చావులలో మన దేశ స్థానం 101. 65 వేల కోట్ల ఆహార సబ్సిడీ తగ్గించారు. బడ్జెట్‌లో ఎమ్‌ఎస్‌పీ ప్రస్తావన లేదు. అన్ని రంగాలకు కోతలే..పెంచింది ఎవరికి?. రేకు డబ్బాలలో రాళ్లు వేసి ఊపినట్లు..మాట్లాడం తప్ప బీజేపీ చేసిందేమి లేదు. సిగ్గులేకుండా ఎల్‌ఐసీని అమ్ముతున్నామని చెప్తున్నారు. ఎల్‌ఐసీ అమ్మకానికి కారణాలు చెప్పాలి. అంతర్జాతీయ భీమా కంపెనీలకు బ్రోకర్‌లుగా వ్యవహరిస్తరా.’ అని సీఎం కేసీఆర్ కేంద్ర బడ్జెట్‌పై ధ్వజమెత్తారు.
