టీఆర్ఎస్ పార్టీ కార్యాయం తెలంగాణ భవన్ లో 70వ రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. ఆ  పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కార్యాలయ ప్రాంగణంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. 

మొదట తెలంగాణ భవన్ కు చేరుకున్న వెంటనే కేటీఆర్ తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేశారు. అనంతరం జాతీయ  జెండాను ఎగురవేశారు. ఈ రిపబ్లిక్ డే వేడుకల సందర్భంగా టీఆర్ఎస్ భవన్ కు భారీ సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు చేరుకున్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ ను కలిసేందుకు, కరచాలనం  చేసేందుకు, సెల్ఫీలు  దిగేందుకు వీరంతా ఎగబడ్డారు. 

ఈ కార్యక్రమంలో హోంమంత్రి మహమూద్ అలీ, ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులకు, కార్యకర్తలకు కేటీఆర్ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలిపారు. 

వీడియో

"