సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ విధ్వంసం కేసు దర్యాప్తులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో సాయి డిఫెన్స్ అకాడమీ డైరెక్టర్ సుబ్బరావుకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. 

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ విధ్వంసం కేసు దర్యాప్తులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో సాయి డిఫెన్స్ అకాడమీ డైరెక్టర్ సుబ్బరావు పాత్రపై పోలీసులు కీలక ఆధారాలు సేకరించారు. సికింద్రాబాద్ విధ్వంసం కేసులో సుబ్బరావును ప్రధాన కుట్రదారుగా తేల్చారు. ఈ క్రమంలోనే సుబ్బారావుతో పాటు అతని అనుచరులు మల్లారెడ్డి, శివ, బీసీ రెడ్డిలను పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని తాజాగా పోలీసులు రైల్వే కోర్టులో హాజరుపరిచారు. దీంతో కోర్టు సుబ్బరావుకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో సుబ్బారావును రైల్వే కోర్టు నుంచి చంచల్‌గూడ జైలుకు తరలిస్తున్నారు. సుబ్బారావుతో పాటు అతని అనుచరులు మల్లారెడ్డి, శివ, బీసీ రెడ్డిలకు కూడా కోర్టు రిమాండ్ విధించింది. 

సుబ్బారావు కన్నుసన్నల్లోనే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో విధ్వంసం జరిగినట్టుగా రైల్వే పోలీసులు నిర్దారణకు వచ్చారు. బిహార్ తరహాలో విధ్వంసం చేయాలని సుబ్బారావు వాట్సాప్ గ్రూప్‌ల్లో మెసేజ్‌లు పెట్టారు. 

ఇక, సుబ్బారావును, అతని అనుచరలును అరెస్ట్ చేసినట్టుగా రైల్వే ఎస్పీ అనురాధ వెల్లడించారు. రైల్వే స్టేషన్‌లో విధ్వంసానికి యువకులను సుబ్బారావు రెచ్చగొట్టాడని చెప్పారు. ఈ నెల 16న సుబ్బారావు నరసరావుపేట నుంచి హైదరాబాద్ వచ్చారని తెలిపారు. బోడుప్పల్‌లోని లాడ్జిలో సుబ్బారావు బస చేశారని చెప్పారు. స్టేషన్‌లో విధ్వంసానికి మద్దతిస్తున్నట్టుగా వాట్సాప్‌లో పోస్టులు చేశాడని వెల్లడించారు.