గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వరద బాధితులకు ఆర్థిక  సహయం అందించడంలో జీహెచ్ఎంసీ  నిస్సహాయత వ్యక్తం చేసినట్లు వచ్చిన వార్తల్లో వాస్తవం లేదని జీహెచ్ఎంసీ స్పష్టం చేసింది.
       
గ్రేటర్ హైదరాబాద్ లో  వరద బాధితులకు ఆర్థిక సహాయం అందించే ప్రక్రియ  మంగళవారం నుండి ప్రారంభమైనదని,  ఒక్క మంగళవారం నాడే 7939 మంది బాధితులకు రూ. 7 .949 కోట్లను సంబంధిత లబ్ధిదారుల బ్యాంకు కాతాల్లో జమ చేశారని వెల్లడించింది. 

నగరంలో వరద బాధితులకు ఆర్థిక సహాయం అందించే ప్రక్రియ కొనసాగుతుందని జీహెచ్ఎంసీ ఒక ప్రకటనలో తెలియ చేసింది. కాగా జీహెచ్ఎంసీ ఎన్నికల నేపధ్యంలో వరదసాయాన్ని ఆపేసిన సంగతి తెలిసిందే.

ఎన్నికల ఫలితాల తరువాత మీ సేవా సెంటర్ల దగ్గర బాధితులు క్యూలు కట్టారు.  అయితే మీ సేవా సెంటర్లకు రావద్దని వరద సాయం నేరుగా బాధితుల ఖాతాల్లోనే పడుతుందని జీహెచ్ఎంసీ తెలిపింది. ఆ పంపిణీ ప్రక్రియ మంగళవారం నుండి ప్రారంభమయ్యింది.